బ్రోచే వారెవరుర - నినువిన - రఘువర
స్వరూపం
బ్రోచేవారెవరురా నిను వినా రఘువరా నను
నీ చరణాంబుజములునే విడజాల కరుణాలవాల
ఓ చతురా ననాధివందిత నీకు పరాకేలనయ్యా
నీ చరితము పొగడలేని నా చింతదీర్చి వరములిచ్చి వేగమే నను
సీతాపతే నాపై నీకభిమానము లేదా వాతాత్మజార్చిత పాద
నా మొరలను వినరాదా ఆతురముగ (ఆత్రముగా) కరి రాజును బ్రోచిన వాసుదేవుడే నీవు గదా
నా పాతకమెల్ల పోగొట్టి గట్టిగ నా చెయ్యి పట్టి విడువక నను