బేతాళపంచవింశతి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

బేతాళపంచవింశతి

1261 – 8/5-1-26/1920-21

1. క. భువిగల రసికులు వినుఁడీ
వివరత భేతాళపంచవింశతికథ లేఁ
బ్రవిమలముగ రచియించెద
నవరసికులు భావమునను నర్మిలి మెచ్చన్.

2. సీ. రజతాద్రి నేకాంతరమ్యహర్‌మ్యమునందుఁ
బసిఁడి యుయ్యేలపైఁ బవ్వళించి
సురతాంతమున నాథుఁ జూచి వేడ్క దలిర్ప
నాదరంబున నిట్టు లనియె గౌరి
కడువిస్మయంబైన కథ లానతిమ్మని
యడుగుటయును జెప్ప నాత్మఁ దలఁచి
యెఱిఁగి మున్నెవ్వరు నెఱుఁగకుండెడునట్టి
యుపకథల్ గాని నే నొల్లననిన
నల్ల నగుచు నభవుఁ డౌగాక లే నీకుఁ
జెప్పువాఁడ నాత్మ కొప్పు గాఁగ
ననుచుఁ జెప్పఁ దొణఁగె నంతలోననఁ బుష్ప
దత్తుఁ డచటఁ బొంచి దాఁగి యుండి.

3. క. దారునకుఁ బువ్వులు గొని తా
వెరవారఁగఁ దెచ్చి కథలు వినియెడికొఱకై
కరమర్థి గోడమీఁదను
పరికింపఁగరాని పసిఁడిబల్లై యుండెన్.

4. వ. ఇట్లు పుష్పదత్తుండు విస్మయపరంబైనవిధంబునఁ బార్వతి హరుఁడును నెఱుంగకుండ కృత్రిమభావంబునం గథలు వినుచుండఁ బరమేశ్వరుండు రుద్రాణికిం బ్రియంబు వుట్టునట్లుగా నిరువదేను కథలు చోద్యంబుగాఁ జెప్పుటయు విని మనంబున నత్యాశ్చర్యం బంది మాయోపాయంబున నిజనివాసమున కరిగి భార్యకుం దనయున్నతెరు గెఱుంగ వివరించి చెప్పిన మరునాఁడు రేపటియవసరంబునకు నభిధామసౌరభంబులు పంచు పారిజాతకుసుమదామంబులుం గొనివచ్చి యాదేవిపాదారవిందంబుల కెరఁగి పుష్పదంతునిభార్యయైన సైరంధ్రిభామ యవస్థ రాయుమని కరంబులు మొగిడ్చి యిట్లనియె.

5. క. విన నింపు వుట్టునట్లుగ
వినుపింపఁగ నేర్తుఁ గథలు వివరముతోడన్
వినుమనుచుఁ బుష్పలావిక
యనుపమమతితోడ గౌరి కన్నియుఁ జెప్పెన్.

6. వ. దత్తావధానవై యొక్కకథ నాకర్ణింపుమని యిట్లని చెప్పె. తొల్లి ప్రతిష్ఠానపురంబునందు విక్రమసేనుండను బ్రఖ్యాతుండై యశస్తేజంబుల చంద్రాదిత్యతుల్యుండైన రాజు గలఁ డతండు రాజ్యంబు సేయుచుండి

యొక్కనాఁడు కాంతిశీలుండను శ్రమణభిక్షుండు సీతాగ్రహణార్థంబు వచ్చినరావణుండునుంబోలె రాజసభకు వచ్చి యొక్కఫలంబు దర్శనం బిచ్చినం బుచ్చుకొని కోశాధికారిచేతి కిచ్చి మాయాభిక్షుతో వినోదింపుచుం బ్రొద్దు పుచ్చుచుండ.

7. క. అదిమొదలు గాఁగ నిచ్చలు
సదమలఫల మొకటిఁ దెచ్చి జగతీపతికిన్
ముద మొదవఁగఁ జన నిచ్చుచు
బదియేండ్లుం గొలిచె నధికభక్తియుతుండై.

8. వ. ఆరా జతండు నిచ్చలు తెచ్చుఫలంబులు కోశాధికారిచేతి కిచ్చుచు యొక్కనాఁడు పండు పుచ్చుకొని క్రీడావానరంబున కిచ్చిన నది దానిం గరచి పుచ్చిన నందొక్కదివ్యరత్నంబు వెడలిన తత్ప్రభాజాలంబునం బేమి యాస్థానం బెల్లఁ బ్రజ్వరిల్లుచున్న నాశ్చర్యం బంది భాండాగారంబునకుం జని యందున్నఫలరాశిగళితంబులైన దివ్యరత్నంబులం జూచి మరునాఁ డెప్పటియట్ల సేవింపవచ్చినభిక్షునకు నా రా జిట్లనియె.

9. గీ. ధర నమూల్యములైన రత్నములు దెచ్చి
యిచ్చి యింతకు మిక్కిలి యేమి వేడం
దలఁచి కొలిచెదు నీదుయత్నంబు గడువి
చిత్రమై యున్న దిది యేమి చెప్పు మనుఁడు.

10. వ. తనకార్యసిద్ధియందుఁ గృపాపరుండైన యా రాజునకు భిక్షుం డి ట్లనియె.

11. చ. అనఘచరిత్ర మాదృశుల యాపద మాన్చి యభీష్టవస్తువుల్
దనరఁగ నిచ్చి శౌచమును ధర్ము సత్యముఁ గల్గి లోకుల
న్మనుపఁగఁ బుట్టియున్న ధృతిమంతుల నాశ్రితధర్మవృద్ధి స
జ్జనయుతులన్ నృపోత్తముల సత్యసమేతుల వేఁడు టొప్పదే.

12. సీ. క్షితినాథ వినుమ యీకృష్ణచతుర్దశి
నాఁటిరేయి స్మశానంబునందు
శక్తిమై నొకమంత్రసాధన మేఁ జేయఁ
గడఁగినవాఁడ నక్కార్యమునకు
నాకుఁ దోడై వచ్చి నరవర రెండవ
సాధకుండవు గాను సతతముగను
నాప్రదేశమున మహావటవృక్షంబు
మొదట నే నుండెద మున్నె పోయి
నీవు రాత్రి రమ్ము నిర్మలఖడ్గంబు
కరము నొడిసివట్టి కడురయమున
నొక్కరుండవును సముజ్జ్వలాకృతితోడ
ననిన నియ్యకొనియె నవనివిభుఁడు.

13. వ. అంత.

14. క. ఆ కృష్ణచతుర్దశినా
డేకాంతమ భిక్షుఁ డచటి కేగుటయును ధా
త్రీకాంతుఁడు సాయంసం

ధ్యాకృత్యము లొనరదీర్చి యత్యుత్సుకుఁడై.

15. సీ. యక్షకర్దమయుక్తమైన భస్మాంగంబు
పొలుపొందఁగా నెఱపూతఁ బూసి
భూరిప్రకాశితపూతవిభూతిపౌం
డ్రకముపై రోచనరచన బెరయ
విమలారుణప్రభావములైన యట్టి సం
ధ్యారాగవస్త్రంబు లమరఁగట్టి
రక్షాకరంబులు రమణీయములు నైన
పృథులనీలంబులపేర్లు వేసి
వీరరసము పొంగి దెలివచ్చె నాఁగస
మున్నతాంగకాంతి యుజ్జ్వలముగ
విక్రమాంబునిధి త్రివిక్రమసేనుఁ డొ
క్కరుఁడు పితృవనమ్ముకడకుఁ గదలె.

16. వ. మఱియు నతఁడు మేరునగంబునుంబోలెఁ బ్రభూతసత్వనివాసంబైఁ గోపవేషధారుండైనకృష్ణుండునుంబోలె మయూరపింఛోల్లసితశిరోవేష్టకుండై ప్రళయకాలునాలుకయుంబోలె నాభీలంబైన కరవాలంబు కేలం బ్రజ్వరిల్ల నీరంధ్రంబైన యంధకారంబున మణిమండలప్రభలు మార్గదర్శనంబులుగా వెడలి స్మశానక్రీడారతుండైన రుద్రుండునుంబోలఁ దత్ప్రదేశంబునకుం బోయె నదియు ధూమాంధకారమేదురధ్వాంతంబును నతల

తవ్రాతకలకలాకులితంబునుఁ గిరితలోల్లోలభీగాయత్విశాఖజీవాక్రాంతానందశిలాతలంబును ప్రతివృక్షప్రవిష్టబ్రహ్మరాక్షసహుంకారభయంకరంబును యాతాయాతప్రవృత్తోత్తాలభేతాలగణసమేతంబును ఘూకభీకరఫూత్కారపూరితంబును నిరంతరప్రవర్తితమృగధూర్తధ్వానతునితదిగంతరంబును దిగంత్తరచితాకారంబై భైరవమారీగణప్రకల్పితచండకాండంబునై మరియు శరీరంబునుంబోలె సర్వావయవమయంబై పరిపాఠితహాసాస్ఫుటితంబైన దేశంబునుంబోలె సజవృక్షావృత్తిం దనరి కౌరవసైన్యంబునుంబోలె కర్ణశల్యోద్ధేతరవంబైన గదాయుద్ధంబునుంబోలె ధీరపూరితవృకోదరంబై వృకోదరచిత్తంబునుంబోలె దుశ్శాసనహృదయాకంపితంబై దండకారణ్యంబునుంబోలె మారీచరుచిరాశ్రమంబై యవివేకిహృదయంబునుంబోలె శంకాకులనికేతనంబై భ్రాంతకంబయ్యును నిరంతరంబై శివాభివ్యాప్తంబయ్యును నశివంబైన స్మశానంబు నిశ్శంకుండై చొచ్చి వటమూలంబునందు విజితమండలమండనుండై యున్నభిక్షుకడకుం బోయి నమస్కరించి నేఁ జేయంగల కార్యం బేమి యని యడిగిన నరేంద్రుం జూచి హర్షవ్యాకోచలోచనుండై యి ట్లనియె.

17. శా. వీరాగ్రేసర నీదుపూనుపు ధరన్ వీరత్వధీరత్వగం
భీరత్వంబున నెన్నఁబోలు పురుషుల్ పెంపున్ యశంబున్ మహో
దారత్వంబును దేజమున్ జయము సత్యం బెన్న నీకుం దగున్

శ్రీరామాధిపమూర్తి సర్వజనసంసేవ్య ప్రభావోదయా.

18. వ. అని యన్నరేంద్రుని గుణకీర్తనంబుఁ జేసి యి ట్లనియె.

19. క. ఇచటికొక యేను మైలను
ప్రచురమహాశాఖి శింశుపావృక్షము భూ
తచయాశ్రయ మున్నది నీ
వచటికిఁ బోవలయు దక్షిణాభిముఖుఁడవై.

20. వ. ఆవృక్షంబునం దొక్కనరుఁడు వ్రేలుచున్నవాఁడు వానిఁ దేవలయుననిన నట్ల సేయుదు నని ప్రవృద్ధంబైన తమకంబునఁ బ్రకాశార్థం బొకకొరవి పట్టుకొని నీచుండునుంబోలె కుంఠితుండై దరిద్రుండునుంబోలె విచ్ఛాయంబై కుకవికావ్యంబునుంబోలె నవిస్పష్టంబై పిశాచంబునుంబోలె విషణ్ణంబైన యావృక్షంబునొద్దకుం బోయి.

21. గీ. దానికొమ్మల నగ్రపాదముఁ దగిల్చి
దీర్ఘబాహులు రెండును దెసలఁ జరఁచి
యవుడు కరచి యధోముఖుఁడైన ఘోర
శవముఁ గనుఁగొని నృపతి నిశ్శంకుఁ డగుచు.

22. వ. ఆ వృక్షంబు నెక్కి శవంబు కరంబులం దున్న పాశంబులు గోసి నేల బడద్రోచిన హాహాకారంబు లెసంగ నాక్రోశింపుచు నాకరంబులు భగ్నంబులయ్యెనని యేడ్చుచున్న నిక్కువంబుగా వగచి యన్నరేంద్రుండు వృక్షంబు దిగివచ్చి కరుణాకలితచిత్తుండై వానిశరీరంబుఁ దోవలచున్నయప్పుడ వికటాకారుండై.

23. క. భూతములకైన యప్పుడు
భీతి జనింపంగ నెగసి బిట్టుగ నగుచున్
భూతలపతికి నదృశ్యుం
డై తీఁగెలనడుమ దూరె నతిరభసమునన్.

24. వ. ఎప్పటియట్ల వృక్షంబుమీదికిం బోయి పాశంబుల మెడం దగిలించికొనియున్నం జూచి భేతాళుమాయఁగా నెఱింగి క్రమ్మరి వృక్షంబు నెక్కి భేతాళరూపధరుండైన వాని లతాపాశంబులం గట్టుకొని దిగివచ్చి భుజశిఖరంబులపైఁ బెట్టుకొని వచ్చుచున్నయెడ నన్నరేశ్వరునకు భేతాళుం డి ట్లనియె.

25. క. నీ కొక కథఁ జెప్పెద సు
శ్లోక వినోదముగ వినంగఁ జోద్యం బదియున్
శ్రీకర మెల్లను బొందును
నాకర్ణింపుము సుబుద్ధి నని యి ట్లనియెన్.

కథ


26. క. వారాణసి యనుపేరను
గౌరీకృతమైన పురము గలదు హిమాద్రీ
స్ఫారస్ఫాటికవిమలా
గారంబై ధరణియందుఁ గడుఁ బెడఁ గడరన్.

27. క. అందులఁ బ్రతాపమకుటుఁ డ
నందె లొలిం (దొర్లి?) గలండు రాజు నరవినుతుఁడు ద

త్సుందరి నిజప్రతాపరు
చిం దనరు నభంబున రవిచెందిరభంగిన్.

28. క. ఆ మనుజేశ్వరు కులసతి
సోమప్రభల ఫనవిత సోమప్రభయు
ద్దామమతి వారికొడుకు ర
మామహితుఁడు గలఁడు వజ్రమకుటుం డనఁగన్.

29. క. కందర్పయాదవేంద్రుల
సౌందర్యము చెప్ప నతని సౌందర్యముచేఁ
బొండువడు ననుచు ధరఁ జె
ప్పందగి యలరూపమహిమఁ బరగు నతండున్.

30. క. ఆరాజకుమారునకు ను
దారుఁడు సఖుఁ డయ్యె మంత్రితనయుఁడు గలఁడే
పారఁగ సమ్మతి బుద్ధిశ
రీరుండను నతఁడు గరము ప్రియకరుఁ డగుచున్.

31. వ. ఆ రాజపుత్త్రుం డొక్కనాఁడు మంత్రిపుత్త్రుం దోడ్కొని మృగయావినోదార్థం బరిగి శార్దూలసింహకరభకురంగభల్లూకవరాహవనలులాయకులంబైన యరణ్యంబుఁ జొచ్చి వారుక్రేంకారవంబు సహింపంజాలక తమపైఁ బఱతెంచు వాలుమృగంబులం జంపి పుష్పలతావేల్లితంబైన వనమధ్యంబు జొచ్చి దాని కనతిదూరంబునం బరిస్ఫుటోజ్జ్వలప్రభాభాసితంబైన వనదేవతావిభ్రమదర్పణంబునుంబోలె నొప్పు సరోవ

రంబునకు వచ్చి యక్కొలనితీరంబునందుఁ గ్రీడార్థంబు డాసి శతసహస్రావృతయై చంద్రరేఖయుంబోలె నయనానందం బొలయ నొప్పుచున్న యక్కన్యం జూచి యుల్లసితమానసుండైన నరేంద్రనందనుం డచ్చోటుం గదలక యుండె నంత.

32. క. ఆ లీలావతి కాంచెను
బాలార్కప్రతిమానతేజుఁ బ్రద్యుమ్ననిభుం
మాలాలంకృతకంధరుఁ
బోలఁగఁ దనదిక్కుఁ జూచు భూపాలసుతున్.

33. క. బాలానిలమున మెల్లన
తూలెడు మృదులతికవోలెఁ దోయజముఖినిన్
లీలావతిఁ బలుమారును
లోలామతిఁ జూచెఁ దంతలోలేక్షణుఁడై.

34. వ. తదనంతరంబ.

35. సీ. రాజపుత్త్రుఁడు చూడ రమణీయతత్సర
సారవృతంబైన నీలోత్పలంబు
కర్ణంబులం దిడి క్రమ్మర నద్దాని
నమరంగ దంతరత్నముల మోపి
ఖండించి పాదయుగ్మముపైని సవిలాస
ముగ వైచి లీలతో మగుడఁ బుచ్చి
ఘనకుచంబులమీఁదఁ గదియించి కుప్పించి

తలపులు సూచించి తడయ కపుడ
అచటువాసి చనియె నానందమూర్తితో
వనిత లలితవదన వనరుహమున
విభ్రమితకటాక్షవిక్షేపము రాజ
తనయుచూడ్కులకు ముదంబు వొదువ.

36. క. తనమందిరంబునకుఁ జని
మనుజేశ్వరసుతుని నెపుడు మదిఁ దలఁపుచు నో
ర్వనికామతాపమున గ
గన డసైను దూర్పుచంద్రకళయుం బోలెన్.

37. వ. అట వజ్రమకుటుండును నిజనగరంబునకుం బోయి యనన్యకార్యుండై యయ్యింతినిం దలంపుచుఁ బ్రతిదినప్రవర్ధమానమనోభవానలతాడ్యమానమానసుం డగుచు బాలప్రవాళశయ్యాస్థుం డయి యున్న నెఱింగి మంత్రిసుతుండైన బుద్ధిశరీరుండు వచ్చి దేవా! ధైర్యసాగరుండ వైన నీ ధైర్యంబున కిది యేమి యపాయంబు వుట్టెనని యి ట్లనియె.

38. క. ఆ చెలువ యెచటిదో యని
యీచింతానలముఁ బొంద నేటికి నీకున్
సూచించె నపుడు సర్వము
నాచే నెఱుఁగంగబడియె నాక్రమమెల్లన్.

39. వ. ఆ యింతి కర్ణంబుల నుత్పలంబు బెట్టికొనుటం జేసి కర్ణోత్పలుండను రాజు కళింగదేశాధీశ్వరుం డనం బ్రసిద్ధుండై యుండు. ఆ పుష్పంబు

దంతంబుల ఖండించుటం జేసి రాజునకు సచివుండైన దంతఘాతకుని కూఁతుర ననుటయు, దానిఁ బద్మంబులమీఁదఁ బెట్టుకొనుట తనపేరు పద్మావతి యనుటయు, ఆయుత్పలంబు తనహృదయంబున నదిమికొనుట నీవు తనహృదయేశ్వరుండవని యెఱింగించుటయు. ఇందు సందేహంబు లేదు. మృగయాఛద్మంబునఁ గ్రమ్మరం బోవవలయు ననిన నారాజకుమారుం డపుడు యతనిం దోడ్కొని.

40. గీ. రాగియై నిరంతరంబును బ్రియజనా
యత్తచిత్తుఁ డగుచు నతిరయమునఁ
గదలెఁ దురగ మెక్కి కామాంధులకు నలం
ఘ్యంబు గలదె యెంతగహన మైన.

41. వ. ఇట్టిరువురునుం గళింగనగరంబునకుం బోయి యందొక్కవృద్ధాంగనఁ బొందుఁ జేసికొని దానియింట విడిది చేసి యేకాంతంబున నక్కాంతతోడ దంతఘాతకు నెఱుంగుదువే యని యడిగిన నెఱుంగుదు నతండ రాజునకు సచివుండు, నతనికూఁతురు పద్మావతి యనఁ గలదని చెప్పి వెండియు ని ట్లనియె.

42. క. వారలకు గర్భదాసిని
వారాశ్రయమందు నెపుడు వర్తింతు సదా
చారంబు కులము నెఱుఁగుదు
మీ రెవ్వ రిదేమి కార్య మెఱిఁగింపుఁ డొగిన్.

43. వ. అనిన దానివలన సంతోషించి యాప్తీకరించి తమవచ్చినకార్యంబు

సర్వంబును నెఱింగించి దానిన దూతికం జేసి పద్మావతియున్నచోటికిం బంపిన నది వోయి కొలనికడకు వచ్చిన రాజకుమారుండు వచ్చియున్నవాఁ డని పద్మావతికిం జెప్పిన దానిం జింతింపనియదియునుంబోలె మిధ్యాకోపంబు దెచ్చుకొని దాని కి ట్లనియె.

44. క. నా కిట్టి మాట చెప్పఁగ
నీకుఁ దగునె ముదుకవరుస నీతియె యిది హా
హా కడుదుశ్శలవు నను
పోకలఁ బుచ్చంగఁ దగునె పురుషులని మదిన్.

45. వ. అని కర్పూరరజోమిళితంబైన హస్తపల్లవంబులు రెండు గండస్థలంబుల వ్రేసిన దుఃఖింపుచు గృహంబునకు వచ్చి తనచెప్పినకార్యంబున కయ్యింతి కోపించి తన్ను వ్రేసిన చందం బిరువురకుం జెప్పిన విని రాజపుత్త్రుండు దుఃఖితుండై నిశ్వాసముఖుం డగుచు మంత్రిపుత్త్రున కి ట్లనియె.

46. ఉ. అక్కట మందభాగ్యకృతయత్నము లేల ఫలించు నెచ్చటన్
నిక్కము దైవతోపహతి నీకు మరల్పఁగ రాద యింక నీ
విక్కడ వాసి న న్విడిచి యేగుము భూమికి దీనియందు నా
మక్కువ చిక్కియున్నయది మాన్పఁగఁ బోలదు దుశ్చికిత్సలన్.

47. వ. ఎటకేనియుం బోయెద ననిన నమ్ముసలిది వినకుండ మంత్రిపుత్త్రుం డి ట్లనియె.

48. క. ఆర్య హితమతివి కడు నీ
ధైర్యము దిగవిడచి యింత తగునే యడలన్

కార్యముఖ మెఱుఁగవలదే
కార్యం బిది నీకు సిద్ధికల్పం బయ్యెన్.

49. వ. అది యట్లుండనిమ్ము. యిమ్ముసలిగండస్థలంబులయందుఁ గర్పూరరజస్సహితంబైన యయ్యింతి హస్తాంగుళంబులు పది యునికిం జేసి శుక్లపక్షం బింక పదిదినంబులు గల విటమీఁదఁ గృష్ణపక్షంబులో సమాగమంబు గలుగునని చెప్పుటయు నన విని యతనివచనంబులకుఁ బ్రహృష్టహృదయుండై యాపదిదినంబులు యెట్టకేనియుం బుచ్చి మరునాఁ డమ్ముసలిం బంచినఁ బద్మావతియు దానిపలుకు లాలకింపక కుంకుమాంకితంబులైన హస్తంబుల నమ్ముసలి యురంబునందుఁ ద్రిపుండ్రంబుగా వ్రేసినఁ దడుకితయై గృహంబునకు వచ్చి యక్కన్య కినిసి తన్ను వ్రేసినచందంబుఁ జెప్పిన మంత్రిపుత్త్రుఁడు శోకోత్కంఠుండైన రాజకుమారునకు నేకాంతంబున ని ట్లనియె.

50. క. తా నిపుడు రజస్వల నని
దీనియురంబునను వ్రేసి తెలుపుట కాదే
మానైన మూఁడురేఖలు
మానిని నిలుపంగఁ జెప్పె మానిని నీకున్.

51. గీ. ఆ యమాత్యతనయుఁ డ ట్లెఱింగించిన
నతిముదంబు బొంది యధిపసుతుఁడు
నాఁడు మొదలుగాఁగ మూఁడుదినంబులు
కడఁగి యేండ్లయట్లు గడపె మఱియు.

52. వ. నాలవదినంబున నెప్పటియట్ల దానిం బుచ్చినం బోయి యక్కన్య దనమాట లాదరించి చేసిన సత్కారంబు చెప్పి రాజగజంబు మదించి గవనివెలుపల నున్నయది యందుం బోరాదు యిందుఁ బొమ్మని యొక్కరజ్జువుం గట్టి మేడ దించి పుత్తెంచెనని చెప్పిన విని మంత్రిపుత్త్రుండు సంతుష్టుండై రాజపుత్త్రుమొగంబుఁ జూచి ని న్నారజ్జు వెక్కి రమ్మన్నయది నీ వచ్చోటికిం బొమ్మనిన నతని యనుమతంబున.

53. క. ఆ రజ్జువు నెక్కి ప్రియ
గారంబునకుం జనియెఁ జేటికలు దిగిచికొనం
గా రాత్రి వివిధప్రే
మారూఢమనస్కుఁ డగుచు నతిరభసమునన్.

54. వ. ఇ ట్లరిగి సుప్తజనపరివృతంబైన యంతఃపురంబు సొచ్చి.

55. క. సుందరనవరత్నప్రభ
నిందుశిలాకుట్టిమమున నింపగు లీలా
మందిరమున మణిశయనము
నం దున్నలతాంగిఁ గాంచె నక్కన్యకయున్.

56. వ. శయ్యాతలంబు వాసి లజ్జావనతవదనయుఁ గంపమానపయోధరవిన్వస్తహస్తయుఁ బరిస్ఫురితవిభ్రమవిలాసితయు నై తొలంగి నిలిచినం జేర నరిగి యా రా జి ట్లనియె.

57. క. నామానసదుగ్ధాబ్ధికి
సోమప్రభ లగుచు నీదుచూడ్కులు వొలయం

గా మొగ మెత్తి సలలితవ
చోమాధుర్యంబు చెవులఁ జొనుపవె దయతోన్.

58. గీ. అనుచు రత్నపాత్రయందున్న సురభిగం
ధంబు దానిమేని కనునయముగఁ
దనియనిచ్చి వేడ్కఁ దాను నాస్వాదించి
మదనమధ...............మానసమున.

59. గీ. కౌఁగిలింప నతని కరమహాగ్రహణ
మీలితాంతరంగయై లతాంగి
మధుమదానురక్తమధుకరం బొలుచుచుం
బనవిధిప్రయోగమునను సొగసి.

60. వ. అంత నా కృత్రిమవిలాసంబును. ఆ శిక్షితకళాక్రమంబును. ఆ విభాంగాంగానుభవంబును నైనసంభోగంబునందు వృద్ధయై రాచకొమారుండు చిత్తవృత్తాపహారి యగుచునుండె. నవ్విధంబునఁ బెక్కురాత్రులు నిరువుర కతిగూఢం బయినసమాగమం బయ్యె నంత నొక్కనాఁడు రాజపుత్త్రుండు వెలినున్న మంత్రిపుత్త్రుం దలంచి.

61. గీ. తల్లిదండ్రుల సకలబాంధవులనెల్లఁ
దొరఁగి పరదేశమునకు నాతోడ వచ్చి
యొక్కరుఁడు మంత్రి[1]సుతుఁడు యెట్లున్నవాఁడొ
యనుచుఁ జించించి మిన్నక యధిపుఁ డున్న.
 
62. వ. అన్యమనస్కుం డగుట యెఱింగి యిది యేమి చింతిచెద వని యడిగిన

యక్కథంతయుఁ జెప్పించుకొని యి ట్లనియె.

63. క. నీకు మనఃప్రియుఁడై
వీఁకను నా యింగితంబు వివిరించి తగం
జేకొని చెప్పఁగ నేర్చువి
వేకము గలసఖుని కింతవిముఖుఁడ వగుదే.

64. వ. అతండు నాకు మాన్యుం డతని కిష్టంబైన శిష్టభోజనంబు వెట్టుమని పంచినం గొనివచ్చి వివిధంబులైన భక్ష్యమాల్యానుతాంబూలాదిపదార్థంబులు మంత్రిపుత్త్రున కిచ్చి తమయిద్దఱి సల్లాపంబులు నెఱింగించిన నతండు భక్ష్యంబులు చూచి రాజపుత్త్రున కి ట్లనియె.

65. క. ననుఁ దలచి నీవు పొగడం
జనునే యీ దయిత యెదుర జనవల్లభనం
దన యింత జడుఁడ వగుదువె
వినవే భక్ష్యంబు లివియు విషదిగ్ధంబుల్.

66. వ. రాజపత్ను లయినస్త్రీలు భర్తలకుం బ్రేమమూలంబులైనవారి కలిమి సహింపరు. నీవు నమ్మవేనిం జూడుమని యాభక్ష్యంబు లొక్కశునకంబునకుఁ బెట్టిన భక్షించి యది యప్పుడ ప్రాణంబులు విడిచినం జూచి యారాజపుత్త్రుం డాయింతివలన నెంతయుఁ గోపించి నిలిచె నట్టియవసరంబున నగరీశ్వరుం డయినకర్ణోత్పలుని ప్రియతనయుండు కాలనియోగంబునం జేసి కాలాంతరంగుండైనఁ దత్కలకలంబు విని మంత్రిపుత్త్రుండు రాజపుత్త్రున కి ట్లనియె.

67. క. మతిఁ గినుకవలదు పద్మా
వతిదెస నీ రాత్రి వోయి వరమధుమదసం
యుతఁ జేసి యెఱుఁగకుండఁగ
నతిరయమున నపహరించు మాభూషణముల్.

68. వ. ఆ తొడవులు వుచ్చుకొని దానితొడ త్రిశూలాంకంబు లాంఛనంబు గోర వ్రాసి వచ్చునది యనిన నట్ల సేయుదునని పోయి మధుపానమత్తయైన దానతొడ త్రిశూలాకారం బొనర్చి యాతొడవు లన్నియుఁ గొని వచ్చినం జూచి యిద్దఱు సిద్ధవేషంబులు ధరియించి యందొక్కహారంబు విపణివీథికిం గొనిపోయి యమ్ము మని రాజపుత్త్రుని చేతి కిచ్చి.

69. క. ఈ హారం బమ్మెద నని
బేహారుల కెల్లఁ జూపుఁ బ్రియమున విలువ క
ద్గోహలులై వచ్చుటయు
న్నీహితమతి దెగిబడక నీకు మెవ్వరికైనన్.

70. గీ. హార మెవ్వరి దని యడిగిరేనియు నట
భిక్షుఁ డమ్మెడునని పేరు చెప్పి
యతని దెత్తు గాక యని ప్రేతవనమున
కరిగె మంత్రిసుతుఁడు నంతఁ బతియు.

71. వ. ఒండురూపంబు చేకొని మౌక్తికవలయంబు గొనిపోయి విపణివీథి జూపునెడఁ గొందఱు రాజపురుషు లిది యెవ్వరిహారం బని యడిగిన వారిం దోడ్కొని వచ్చి విప్రవేషధరుండైన మంత్రిపుత్త్రుం జూపి వీరు

మా గురువులు వీరి యర్థం బిది యని చెప్పిన వార లాభిక్షున కి ట్లనిరి.

72. క. మీ రెవ రీమణిహారము
చేరిన తెఱఁ గేమి మాకుఁ జెప్పరె యనినన్
మీరాజు వచ్చి యడిగెడు
మీ రడుగఁగవలదు పొండు మీపతికడకున్.

73. గీ. అనిన వారు పోయి యట్ల చెప్పుటయుఁ గ
ర్ణోత్పలుండు భిక్షునొద్ద కరిగి
భక్తియుక్తుఁ డగుచుఁ బ్రణమిల్ల నతని దీ
వించి యిట్టు లనియె వికృతవేషి.

74. క. భూనాథ నీపురంబున
మానవు లొరు లెఱుఁగకుండ మరుపడి యొకచో
దానవి యున్నది యెఱుంగవ
కో నల దంతఘాతకుని కూఁ తనుచున్.

75. వ. అది రాత్రి యెల్లను దిగంబరియై వర్తింపుచుండు నది మొన్న నీపుత్త్రున కపాయంబు చేసినం గోపించి శూలంబున వ్రేసి దానిహారంబు వుచ్చుకొంటి నది స్త్రీ యగుటం జేసి వధార్హురాలు గాదు. నీపురంబు వెడలంద్రోపించు మనినఁ గర్ణోత్పలుండు కోపానలకళంకితుండై పద్మావతిం బట్టి తెప్పించి యూరువందున్న త్రిశూలాంకంబు పరిచారులచేతం జూపించి భిక్షుండు చెప్పిన శూలాంకంబని తలంచి యప్పు డత

ని నగరంబు వెడలం దోపించినంత భ్రాంతమానసయై పురంబు వెడలిపోయెఁ గర్ణోత్పలుండును గృతకభిక్షుని వీడ్కొని పోయె నంత.

76. క. ఆ పడఁతియుఁ గడువంబడి
వాపోవుచు వెడచుండ వారలు నిజమౌ
రూపములం దాల్చిరి
భూపతితనయుండు మత్రుపుత్త్రుం డంతన్.

77. వ. ఇ ట్లరుదెంచి రోదనాకలితయైన దాని ననునయించి దోడ్కొని వారాణసీపురంబునకు వచ్చి వజ్రమకుటుం డయ్యింతియం దనురక్తుండై సుఖం బనుభవించుచుండె. నిట దంతఘాతకుండుఁ దనకూఁతురు తనుబాసిన తెఱంగునకు తలంచుచుఁ బ్రాణంబులు విడిచె నతనిభార్యయుం దదనుగమనంబు చేసె నని కథ చెప్పి భేతాళుండు వెండియు ని ట్లనియె.

78. క. తనకూఁతురు తను బాసిన
ననిశంబును నడలి యడలి యాదుఃఖభరం
బున దంతఘాతకుఁడు చ
చ్చినపాపం బెవరిఁ దాఁకుఁ జెప్పఁగవలయున్.

79. గీ. ఎఱిఁగి చెప్పకున్న నీయాయుధంబునఁ
దల వగుల్చు జువ్వె ధర్మశాస్త్ర

విదుఁడ వౌట నీవివేకతఁ దప్పక
చెప్పి చేయు నాదు చిత్త మలర.

80. వ. అనిన భేతాళున కమ్మానవేశ్వరుం డిద్ధవిచారుండై యి ట్లనియె.

81. సీ. రాజపుత్త్రునకు రమణికి నెగ్గులే
దంగజరాగాత్ము లగుటఁ జేసి
పతిభక్తినిరతుఁడై పటుబుద్ధి గావున
మంత్రిపుత్త్రునకుఁ గల్మషము లేదు
కర్ణోత్పలుఁడు వివేకము దప్పి యె ద్దీనె
ననిన గొందిని గట్టుమన్నయట్లు
యసుర యని మంత్రి నరయక వెడలంగ
నడిచె సచివుకూఁతు నక్షణంబ
దానఁ జేసి దానితండ్రి మృతుం డయ్యె
గాన యతఁడు పాపకర్ముఁ డనియె.

82. క. శోధించి సేయవలయు ధ
రాధిపతులు కార్యములును యాగములు మణుల్
శోధింపక చేసిన దు
ర్యోధనునకు బాడి దగిలి యుండిన భంగిన్.

కథ


83. క. అని మౌన మెడలి పల్కిన
మనుజేశ్వరు మూపు డిగ్గి మసలక వేగం

బున భేతాళుఁడు వృక్షం
బునకుం జని తగిలియుండె ముందటిభంగిన్.

84. గీ. వానివెనుకఁ బోయి వదలక యావృక్ష
మెక్కి పట్టుకొని యహీనబలుఁడు
గురుభుజంబునందుఁ గొనివచ్చునెడ వాఁడు
నవనిపతికి నిట్టు లనియె మఱియు.

85. సీ. ధరణీశ వినుము దత్తావధానుండవై
చెప్పెద నొకకథ చిత్త మలరఁ
గాళిందితటమునఁ గలదు బ్రహ్మస్థలం
బనఁ గల యగ్రహారంబునందు
ననఘుఁ డగ్నిస్వామి యనుబ్రాహ్మణుఁడు శృతా
ధ్యయనసంపన్నుఁ డుత్తముఁడు గలఁడు
తత్పుత్త్రి కలదు మందాకినీకన్యక
మందారమాలికామధురగాత్రి
మహితరూప కులాచారమహిమయందుఁ
బేరు గలయది గావునఁ బృథివియందుఁ
దగినవారలు బ్రాహ్మణోత్తములు వత్తు
రర్థిఁ గన్యకఁ గొడుకుల కడుగవేఁడి.

86. వ. అంత నొక్కనాఁడు.

87. క. మూవురు విప్రకుమారులు

భావజతనుగుణవయోవిభవరూపసమా
నావయవు లొక్కచందము
భావింపఁగరాదు విడుప రనంగ వచ్చున్.

88. క. ఆ కన్యను నర్థింపఁగ
కా కాములు మువ్వురును మహౌత్సుక్యముతో
నా కన్య తండ్రిపాలికి
వీఁకను జని యడుగుటయును విస్మితుఁ డగుచున్.

89. వ. దర్పకప్రతిరూపంబులుంబోని యమ్మువ్వురం జూచి విచారింపుచుండె నంత వార లాయగ్నిస్వామి కి ట్లనిరి.

90. గీ. అనఘ నీవు మువురయం దొక్కనికిఁ గూఁతు
నిచ్చెదేని యున్న యిద్దఱమును
బ్రాణముల్ త్యజించఁ బ్రతిన పూనితి మనఁ
బాల నీగ నోడె బ్రాహ్మణుండు.

91. వ. వారును నయనానందకారియైన యక్కన్య నిచ్చలుం జూచుచుఁ బాసి పోవంజాలక యప్పురంబునందుఁ బ్రకృతాశ్రయులై వర్తింపుచుండి రంత సద్గుణసముదాయపరాఙ్ముఖుండైన విధిచేతం జేసి యక్కన్య కాలప్రాప్తంబైన నమ్మువ్వురు శోకాకులితులై రోదనంబు సేయుచున్న నం దొక్కరుండు దుఃఖాతిశయంబున భస్మధారియై దేశాంతరంబున కరిగె. మఱియు నొక్కరుండు నక్కన్యకయస్థులుం గొని వారాణసికిం బోయె. మరియు నొక్కరుండు దానిదహించినభస్మంబు నాశ్రయించి స్మశానం

బిల్లుగా నుండె.

92. అట్టు మతిమంతులైన ధరాసురోత్త
ములకుఁ బొలఁతికై యిట్టి దుర్బుద్ధి వుట్టె
రాగు లయ్యను యిష్టవియోగవంతు
లైనవారలు సేయనియవియుఁ గలవె.

93. వ. జటాభస్మధారుండై మున్ను వోయినవాఁడు దేశభ్రమణంబు సేయుచు యొక్కయగ్రహారమునందు రుద్రశర్మ యనువిప్రుండు గ్రాసం బిచ్చిన భోజనంబు సేయునెడ గృహస్తునితోడం గోపించి తద్గృపాణి యేడ్చుచున్న తనకొడుకు నెత్తి యగ్నియందు వైచిన తత్క్షణంబ యబ్బాలకుండు మృతుండయ్యె నంత నాభిక్షుండు గోపించి భోజనం బుడిగి.

94. గీ. మాలకోమలింటి కేల వచ్చితి నన
నలర వేగ నాగృహస్థుఁ డపుడు
మంత్రశాస్త్రవాదుండు మంత్రకల్పము చూచి
మహితమైన సిద్ధమంత్రమునను.

95. వ. తనపుత్త్రుని సజీవితునిం జేసిన జటాధరుం డతివిస్మితుండై యందు నిల్చి ప్రియాజీవితార్థుండై యారాత్రి యావిప్రు మంత్రకల్పం బపహరించికొని మగిడి వచ్చునెడఁ దీర్థాగతుండైన వానిం గని యిరువురుం గూడి మందారవతిని దహించిన భస్మంబుకడకుఁ జని యచ్చోట నున్నయతనినిం గాంచి రంత మంత్రసిద్ధుండైన జటాధరుం డక్కన్యక

భస్మాస్థిపుంజంబు లొకప్రోవు గావించి యది యభిమంత్రించి సిద్ధమంత్రోదకంబు చల్లిన యక్షణంబ.

96. క. లావణ్యపుణ్యలక్షణ
పావనలలితాంగి యట్టిభస్మమునడుమన్
తా వెడలె దుగ్ధవారిధి
లో వెడలిన లచ్చివోలె లోకస్తుతయై.

97. వ. ఇ ట్లుద్భవించి నయనానందంబు బొందింపుచున్న యక్కన్నియం గాంచి విస్మయానందంబులఁ గందర్పసంచలితహృదయు లగుచు నొండొరులం గండు వా.

98. క నే మంత్రసిద్ధి బడసితి
నేమును బహుతీర్థములకు నేగితి భస్మం
బే మీరకుండితి నే ననఁ
గా మువ్వురి కింపు దిగని కలవరం బయ్యెన్.

99. క అను నా మువ్వురిలో నె
వ్వనియాలగు ధర్మయుక్తి వనితారత్నం
బన భేతాళున కి ట్లని
యె నృపవరుండు శాపమంత్రితుఁ డగుచున్.

100. గీ మంత్రశక్తిఁ జేసి మగుడఁ బుట్టించిన
వాఁడు తండ్రి యస్థివాహుఁ డగుచుఁ
దీర్థ మరిగినతఁడు తెల్లమిగ కొడుకు

భస్మశయనుఁ డింతి పతి నిజంబు.

101. వ. అనిన నదృశ్యుండై భేతాళుండు వృక్షంబునకుం బాఱిన బట్టుకొని వచ్చునెడ వాఁడు వెండియు ని ట్లనియె.

౨ కథ


102. గీ. అనఘ విక్రమకేసరి యనఁగఁ గలఁడు
రాజు పాలివివృత్తపురంబునందు
సతతలక్ష్మశుఁ డాతని సుతుఁడు ఘనప
రాక్రముం డఖిలలోకనిరతయశుండు.

103. క. ఆ రాజకుమారునకును
కీరము గల దొకటి యది యఖిలశాస్త్రములన్
భూరికళాసంచయమునఁ
బారీణతఁ దాల్చి యొప్పు బహుజననుతమై.

104. వ. మఱియుం గాంతాప్రసాదసేవాయత్నంబులం దత్కథావిదులయిన మానవులకంటె వివేకంబు గలిగి యతతానాగతపరిజ్ఞానంబున విద్వజ్జనులకంటె భూమియందుఁ బొగడ్త కెక్కి నిజపక్షకాంతిపటంబునం జేసి తనయున్నకనకపంజరంబునుంబోలె నొప్పుచుండ సకలజనసేవ్యంబై యుండు నచ్చిలుక యేమి చెప్పిన నిజం బని యుపలాలించుచు నొక్కనాఁడు రాజకుమారుండు దాని కి ట్లనియె.

105. క. నీవు సమస్తము నెఱుఁగుదు
నా విమలత నిన్ను నొకటి యడిగెదఁ జెపుమా

యే వసుమతీశు కూఁతురు
భావింపఁగ భామ యగుశుభస్థితి నాకున్.

106. వ. అనిన చిలుక రాజకుమారునిం జూచి మగధేశ్వరుండైన చంద్రావలోకుండను రాజు కూఁతురు చంద్రప్రభ యనుకన్యక నీకుం బత్ని యగునని చెప్పిన విని మనోభవాయత్తచిత్తుండై.

107. క. ఆ మగధేశ్వరతనయుం
డా మగధేశ్వరతనూజ ననిశము నాత్మన్
బ్రేమమునఁ దలఁపుచుండెను
గామునిసంకల్పనిహతిఁ గడునిజ మరయన్.

108. క. ఆ మగధకన్యకకును
సోమిక యనుపెంటిచిలుక సుఖమధురవచో
ద్దామంబు గలదు ప్రియసఖి
యై ముద మొదవించు బహుకళాగమవిధులన్.

109. వ. ఒక్కనాఁ డక్కన్నియయును నాకుం బురుషుం డెవ్వం డగునని యచ్చిలుక నడిగినఁ బరాక్రమకేసరి యనురాజకుమారుండు నీకుం బ్రియుం డగునని చెప్పిన విని సంతసించి యతనిఁ దలంచుచు మనోనుతాపిత యగుచుండె నంతఁ గాలక్రమంబున విక్రమకేసరి తనకొడుకునకు నీకూఁతు నిమ్మని మగధేశ్వరు నడుగఁ బంపిన దైవయోగంబున సంబంధబాంధవంబు నందించిన నానందవిభవం బెసంగ సకలమనోహరంబు వర్తించునంతం బరాక్రమకేసరి చంద్రప్రభాసహితుండై రోహిణీసహితుండైన

సుధాకరుండునుంబోలె నత్యంతకాంతికలితాననుండై.

110. క. ఆ లలితాంగియుఁ దానును
లీలోద్యానంబులను లలితహర్మ్యములన్
గేళి యొనర్చుచు నుండఁగ
నాలంకృతమతి సమున్నతౌత్సుక్యమునన్.

111. వ. అంత నొక్కనాఁడు.
112. గీ. ఇద్ధబుద్ధులైన యిరువురచిలుకలు
రమణ నొక్కపంజరమున నుండి
రాజతనయుచిలుక రమణిశారికతోడ
ననుభవింపుచుండు మనిన నదియు.

113. క. పురుషు లరయఁ గృతఘ్నులు
క్రూరులు నా నేల నాకు రుచి పుట్టదు నీ
తో రతి సేయఁగ ననవుడు
శారికపలుకులకుఁ జిలుక సైఁపక పలికెన్.

114. క. వనితలు దోషంబుల పు
ట్టినయిండ్లును గాదె యీ కఠినభాషలు నె
ట్టన విరసంబుగఁ బలికితి
విన నేరం బయ్యె నవియు విపరీతములై.

115. వ. అని తమలో వివాదంబు సేయుచుండఁ బంజరంబుకడకు వచ్చిన రాజపుత్త్రు నెదుర దాసిత్వపణంబుగాఁ జేసి పన్నిదంబు చరచిన నారెండు

డుచిలుకలం జూచి దరహసితవదనుం డగుచు స్త్రీపురుషుల దోషంబు లేర్పడ విభాగించి చెప్పిన వినినయటమీఁద న్యాయంబు సెప్పెదమని రాజపుత్త్రునకుఁ గింశుకముకుళంబునుం బోని చంచుపుటంబు శోభిల్లుచుండ శారిక మొదల ని ట్లనియె.

116. సీ. ఆవంతియను పురి నర్థవంతుండను
వైశ్యుండు బహుధనపరుఁడు గలఁడు
ధనవంతుఁ డనఁగ నాతనిపుత్త్రుఁ డభినవ
యౌవనరూపుఁడై యమరుచుండు
నంతటఁ దండ్రికాలావసానమున భా
ర్యయుఁ దాను సురలోక మరుగుటయును
నంత ధూర్తులఁ గూడి యతులితమైన యా
ధన మెల్ల నిజకులధర్మ మెడలి
యనుదినంబును ద్యూతవేశ్యానురక్తి
నర్థమంతయు గోల్పోయి యతిదరిద్రుఁ
డైన వదలిరి ధూర్తసహాయు లెల్ల
నంత నొకరుఁడు వోయె దేశాంతరంబు.

117. వ. దుశ్చారుండై నిరం[తరం]బును దిరు[గు]చు సంతాపనివృత్తంబైన చందనపురంబు చేరి యందు హిరణ్యగుప్తుం డనువైశ్యుం డతని నెఱింగి తనకూఁతు నిచ్చి యపుత్త్రకుండును నతిసమర్థుండును గావున నతనియొద్దన పెట్టుకొనియున్న ధనవంతుండు భార్యాసమేతుండై సుఖింపుచు

నందుఁ బెద్దకాలం బుండి నిజదేశంబునకుఁ బోయెదనని యొక్కనాఁడు మామ కెఱింగించిన నతం డి ట్లనియె.

118. క. అల్లుఁడవు కొడుకు వన్నను
దెల్లమి గా నీవె నాకు ధృతిఁ గూఁతును నా
యిల్లును సర్వము నిచ్చితిఁ
జెల్లంబో విడిచిపోవఁ జెల్లునె నీకున్.

119. గీ. అనిన మామవల్కు విని యేఁ గృతఘ్నుండఁ
గాను నమ్ము మేడుగడయు నీవ
నేను దల్లికిఁ జూపి నీకూఁతు మ్రొక్కించి
మగుడఁ దోడి తెత్తు మసల కనిన.

120. క. చల్లనిమాటల కెంతయు
నుల్లంబున నమ్మి మామయును జాలధనం
బల్లునకుఁ గూఁతునకు శో
భిల్లెడు తొడవులును నిచ్చి ప్రియ మొనరంగన్.

121. గీ. దాసి నొకతె నిచ్చి తడయక యనిచినఁ
దోడుకొనుచు బోయి దుష్టబుద్ధి
యగుచుఁ బోయి యొక్కయడవిలోఁ దెరువున
నూయిగుంటఁ జేరఁ బోయి నిలిచి.

122. క. వాపోవఁగఁ దొడవులుఁ గొని
పాపాత్ముఁడు గూఢలతల భార్యను దాసిన్

వేపట్టి కట్టి త్రోచెను
గాపురుషుల కేల కల్గుఁ గరుణాదరముల్.

123. క. ఇరువుర ని ట్లుగ్రుండై
పొరినూతం ద్రోచి శంకఁ బొందక యరిగన్
తెరువరు లంతట నంగన
పరివేదనరవము కనుచుఁ బారిరయమునన్.

124. వ. భయభ్రాంతయై నలుదిక్కులం జూచుచు హాహారవంబు లెసంగ నేడ్చుచున్న యన్నాతిం జూచి యోడకోడకుమని నుయ్యిఁ జొచ్చి వెడలఁ దిగిచి రంత.

125. క. తరలాక్షి బ్రదికె నాయుః
పరిశేషము కలిమిఁ జేసి బానిశభూతా
దరణమునఁ జొచ్చె జనులకు
మరణంబె విన్న ధర్మమార్గము లెందున్.

126. క. తెరవరు లొయ్యనఁ దోడ్కొని
యరుగఁగఁ బురిజను లెఱింగి యాయంగన నా
దరమున నప్పుడ నిజమం
దిరమునకును దండ్రికడకుఁ దెచ్చిరి యంతన్.

127. వ. తండ్రియు భయము భ్రమంబులు హృదయంబున గదుర నెదురువచ్చి కూఁతుం దోడ్కొనిపోయి యుత్సంగంబుపైఁ బెట్టుకొని నీ వొక్కర్తెవు మగనిం బాసి యిట్టు వచ్చిన తెఱం గేమి యని యడిగిన నయ్యింతి భయ

కంపితశరీరయై యి ట్లనియె.

128. మ. అడవిన్ మ్రుచ్చు వచ్చి పట్టుకొని నీయల్లు బెడంగేలు గట్టి యి
క్కడ నీ విచ్చినసొమ్ము పుచ్చుకొని చక్కన్నంత గాలించి నా
తొడవు ల్గైకొని నూతం ద్రోసి యతనిం దోడ్కొంచు నక్కానలో
వెడలం బారి రటంచు నేడ్చుచును నిర్వేదించుచుం బల్కఁగన్.

129. గీ. కూఁతు గారవించి గొనకొని క్రమ్మర
నీరు దుడిచి యమ్మ నీకుఁ దొడవు
లేమి బాతి యిదియె యిచ్చెద నీ పతి
నేమి చేసి రొక్కొ యెట్టులొక్కొ.

130. క. అని తలంచుచుండ నయ్యం
గనయును సంతతము తనమగని రాకయు నె
మ్మనమునఁ గోరుచు నడలుచు
దినములు గడుపుచుఁ జరించె దీనాననయై.

131. వ. మఱియుఁ గొండొకకాలంబునకు ధనదత్తుండు మామ యిచ్చినధనంబును భార్య తొడవులును భక్షించి కృతఘ్నుండు గావున నిశ్శంకుండై మామయొద్దకుఁ బోయి తనభార్య మరణం బెఱింగించి పునర్వివాహంబునకు ధనం బడిగెద నని తలంచి చందనపురంబున కరిగి మామయింటికిం బోయి తనభార్యం జూచి యులికిపడి భయభ్రాంతుండై వజ్రహతుండునుంబోలెఁ బడిన నయ్యింతి యెఱింగి పరతెంచి యతనిచెవిం జేరి యి ట్లనియె.

132. క. నీచేసినయపకార్యము
నాచే మాతండ్రి వినఁడు నమ్ముము భీతిం
బాసి గృహాంతరమున సుఖి
వై చరించునది సుమ్ము యనురాగమునన్.

133. గీ. అతిరహస్యమైన యట్టి తద్గృహమున
నతని నునిచి యభిమతార్థసమితిఁ
దెచ్చిపెట్టి వానిఁ దృప్తునిఁ జేయుచు
నొనర నతని బొందియుండె నంత.

134. వ. ఎట్టకేనియుఁ గొన్నిదినంబు లుండి యతండు జూదంబునందుం దద్దయు లోలుండు గావున నర్థంబు గావలసి యొక్కనాఁటిరాత్రి భార్యం జంపి తొడవు లన్నియుం గొని యతిసాహసుండై యెటయేనియుం బోయెఁ గావున.

135. క. ఇటువంటి పాపచరితులఁ
గుటిలాత్ములఁ బొందఁదగదు క్రూరుల నెపుడున్
పటుబుద్ధులైనవారిని
గుటిలుల భామ లిటు పొందఁ గూడునె యెందున్.

136. క. అనవుడు శారిక పలుకులు
విని రాజకుమారువరుఁడు విస్మితమతియై
తనచిలుకఁ జూచి నవ్వుచు
వినుతకళాభిజ్ఞ చెప్పవే నీ వనినన్.

137. వ. రాజపుత్త్రునకుఁ గ్రీడాశుకం బిట్లని చెప్పెఁ దొల్లి హవతి యనుపురంబున ధర్ముండను రాజు గలఁడు. ఆ రాజ్యంబున ధనవంతుం డనువైశ్యుండు గలం డతనికూఁతురు ధవళవతి యనుకన్య గల దది రూపలావణ్యనిలయంబై తారుణ్యతరమంజరియై యున్న దానిం దామ్రర్తుపురవాసుండైన సముద్రదత్తుం డనువైశ్యకుమారున కిచ్చి యపుత్రకుండు గావున నతనిం దనయొద్దఁ బెట్టుకొని యుండ నతండు తనవారిం జూచువేడుక నూరికి గమనోన్ముఖుండై తనపత్ని ననుపుమనిన నతం డనుపక తనయొద్దన పెట్టుకొనియుండ నక్కన్య యొక్కనాఁడు.

138. సీ. అలరంగ రమ్యవాతాయనంబునం జూచె
బురుషమార్గంబునం బోవుచున్న
వాని సుస్నాతుని వరరూపసౌందర్య
మందిరు విప్రకుమారు నొకని
గనుఁగొని కామించి దనమనం బతనిపై
నిలిపి కామానలనిహితహృదయ
కమలయై యెంతయుఁ గలఁగి మతిఁ దన
సఖి కేకతంబ యిష్టంబు సెప్పి
యితని బ్రత్యక్షముగను నేఁ డెల్లభంగిఁ
గవయకుండితినేని సుఖంబు గలదె
ప్రకటయౌవనసౌభాగ్యభంగమైన
తలఁపు నిలుపును గులమును దైవ మెఱుఁగు.

139. క. అనిప కాతని జెలిక
త్తెను దెమ్మని పంచి గూఢతరకామసుఖం
బొనరింపుచుండె ననిశము
వనితల రాగంబు దుర్నివారోత్సుకులై.

140. వ. ఇట్లుం దనయల్లుండు ధనదత్తుండు సంతోషించి యతిసత్కారగౌరవంబునం బూజించె. నంత నతండు నా రాత్రి విమలమాల్యాంబరాభరణరాజితుండై శయ్యాగృహంబునకు వచ్చి భార్యాసమేతుండై మధుపానం బొనరించి సంభోగకుతూహలుండై యాలింగనంబు సేయు నవసరంబున.

141. సీ. ఆ యింతి మొదల నన్యాసక్త కావున
పతి భజించనివి బలువు చేసి
పైవల్ల్వతోఁ గూడ బాహుమూలంబున
ఖండితంబుగ స్వస్తికములు చేసి
ఘనపయోధరములు కంపింప ఘటితంబు
నూరుప్రదేశంబు లొనరఁ జేసి
చలి దాఁకినదిబోలెఁ జలితాంగియై కర
స్పర్శ సహింపక పలుకకుండె
దానియాకృతిఁ దలంపును దా నెఱుఁగక
మూఢుఁ డనునయించి మ్రొక్కఁదొడఁగె
మున్ను రాగియై మోశఁ జెప్పంగ నేల

యెట్టివారికైన నాస్థ వుట్టు.

142. క. జరభి తనతండ్రియాజ్ఞకు
వెరచి మగనివద్దఁ జిచ్చు వేసినది పైఁ
జెరుపఁగ నున్నతెఱుగున
నెఱి చెడి కాంత తడవుండె నిశ్చేష్టితయై.

143. వ. అంత నతండు మధుపానవశుండై కాష్ఠంబునుంబోలెఁ బడియున్న నెఱింగి సర్వాభరణభూషితయై యుద్యానవనంబున కరిగి యందు నంతకుమున్న సర్పదష్టుండై శరీరంబు విడచి యున్న యతని డగ్గఱి చూచి.

144. క. పిడు గడఁచినట్లు పతిపైఁ
బడి హా ప్రియ హా మదేకబాంధవ నన్నున్
విడిచితె నాకై జీవము
విడచితె సంసారసుఖము విడిచితె యకటా.

145. గీ. అనుచు మీఁద వ్రాలి యందలయెతి యం
దంద కుచతటముల నదుముకొనుచు
నచటఁ దడయుటయును నలిగితె నాతోడఁ
బలుకవేల యనుచుఁ బడఁతి మఱియు.

146. క. తరుణాక్షాశ్రులు మునుఁకుచు
శిరమున పుష్పములు చక్కఁ జివురుచుఁ దాంబూ
లరుచిరమగు దానధరము

పుట:బేతాళపంచవింశతి.pdf/37 పుట:బేతాళపంచవింశతి.pdf/38 పుట:బేతాళపంచవింశతి.pdf/39 పుట:బేతాళపంచవింశతి.pdf/40 పుట:బేతాళపంచవింశతి.pdf/41 పుట:బేతాళపంచవింశతి.pdf/42 పుట:బేతాళపంచవింశతి.pdf/43 పుట:బేతాళపంచవింశతి.pdf/44 పుట:బేతాళపంచవింశతి.pdf/45 పుట:బేతాళపంచవింశతి.pdf/46 పుట:బేతాళపంచవింశతి.pdf/47 పుట:బేతాళపంచవింశతి.pdf/48 పుట:బేతాళపంచవింశతి.pdf/49 పుట:బేతాళపంచవింశతి.pdf/50 పుట:బేతాళపంచవింశతి.pdf/51 పుట:బేతాళపంచవింశతి.pdf/52 పుట:బేతాళపంచవింశతి.pdf/53 పుట:బేతాళపంచవింశతి.pdf/54 పుట:బేతాళపంచవింశతి.pdf/55 పుట:బేతాళపంచవింశతి.pdf/56 పుట:బేతాళపంచవింశతి.pdf/57 పుట:బేతాళపంచవింశతి.pdf/58 పుట:బేతాళపంచవింశతి.pdf/59 పుట:బేతాళపంచవింశతి.pdf/60 పుట:బేతాళపంచవింశతి.pdf/61 పుట:బేతాళపంచవింశతి.pdf/62 పుట:బేతాళపంచవింశతి.pdf/63 పుట:బేతాళపంచవింశతి.pdf/64 పుట:బేతాళపంచవింశతి.pdf/65 పుట:బేతాళపంచవింశతి.pdf/66 పుట:బేతాళపంచవింశతి.pdf/67 పుట:బేతాళపంచవింశతి.pdf/68 పుట:బేతాళపంచవింశతి.pdf/69 పుట:బేతాళపంచవింశతి.pdf/70 పుట:బేతాళపంచవింశతి.pdf/71 పుట:బేతాళపంచవింశతి.pdf/72 పుట:బేతాళపంచవింశతి.pdf/73 పుట:బేతాళపంచవింశతి.pdf/74 పుట:బేతాళపంచవింశతి.pdf/75 పుట:బేతాళపంచవింశతి.pdf/76 పుట:బేతాళపంచవింశతి.pdf/77 పుట:బేతాళపంచవింశతి.pdf/78 పుట:బేతాళపంచవింశతి.pdf/79 పుట:బేతాళపంచవింశతి.pdf/80 పుట:బేతాళపంచవింశతి.pdf/81 పుట:బేతాళపంచవింశతి.pdf/82 పుట:బేతాళపంచవింశతి.pdf/83 పుట:బేతాళపంచవింశతి.pdf/84 పుట:బేతాళపంచవింశతి.pdf/85 పుట:బేతాళపంచవింశతి.pdf/86 పుట:బేతాళపంచవింశతి.pdf/87 పుట:బేతాళపంచవింశతి.pdf/88 పుట:బేతాళపంచవింశతి.pdf/89 పుట:బేతాళపంచవింశతి.pdf/90 పుట:బేతాళపంచవింశతి.pdf/91 పుట:బేతాళపంచవింశతి.pdf/92 పుట:బేతాళపంచవింశతి.pdf/93 పుట:బేతాళపంచవింశతి.pdf/94 పుట:బేతాళపంచవింశతి.pdf/95 పుట:బేతాళపంచవింశతి.pdf/96 పుట:బేతాళపంచవింశతి.pdf/97 పుట:బేతాళపంచవింశతి.pdf/98 పుట:బేతాళపంచవింశతి.pdf/99 పుట:బేతాళపంచవింశతి.pdf/100 పుట:బేతాళపంచవింశతి.pdf/101 పుట:బేతాళపంచవింశతి.pdf/102 పుట:బేతాళపంచవింశతి.pdf/103 పుట:బేతాళపంచవింశతి.pdf/104 పుట:బేతాళపంచవింశతి.pdf/105 పుట:బేతాళపంచవింశతి.pdf/106 పుట:బేతాళపంచవింశతి.pdf/107 పుట:బేతాళపంచవింశతి.pdf/108 పుట:బేతాళపంచవింశతి.pdf/109 పుట:బేతాళపంచవింశతి.pdf/110 పుట:బేతాళపంచవింశతి.pdf/111 పుట:బేతాళపంచవింశతి.pdf/112 పుట:బేతాళపంచవింశతి.pdf/113 పుట:బేతాళపంచవింశతి.pdf/114 పుట:బేతాళపంచవింశతి.pdf/115 పుట:బేతాళపంచవింశతి.pdf/116 పుట:బేతాళపంచవింశతి.pdf/117 పుట:బేతాళపంచవింశతి.pdf/118 పుట:బేతాళపంచవింశతి.pdf/119 పుట:బేతాళపంచవింశతి.pdf/120 పుట:బేతాళపంచవింశతి.pdf/121 పుట:బేతాళపంచవింశతి.pdf/122 పుట:బేతాళపంచవింశతి.pdf/123 పుట:బేతాళపంచవింశతి.pdf/124 పుట:బేతాళపంచవింశతి.pdf/125 పుట:బేతాళపంచవింశతి.pdf/126 పుట:బేతాళపంచవింశతి.pdf/127 పుట:బేతాళపంచవింశతి.pdf/128 పుట:బేతాళపంచవింశతి.pdf/129 పుట:బేతాళపంచవింశతి.pdf/130 పుట:బేతాళపంచవింశతి.pdf/131 పుట:బేతాళపంచవింశతి.pdf/132 పుట:బేతాళపంచవింశతి.pdf/133 పుట:బేతాళపంచవింశతి.pdf/134 పుట:బేతాళపంచవింశతి.pdf/135 పుట:బేతాళపంచవింశతి.pdf/136 పుట:బేతాళపంచవింశతి.pdf/137 పుట:బేతాళపంచవింశతి.pdf/138 పుట:బేతాళపంచవింశతి.pdf/139 పుట:బేతాళపంచవింశతి.pdf/140 పుట:బేతాళపంచవింశతి.pdf/141 పుట:బేతాళపంచవింశతి.pdf/142 పుట:బేతాళపంచవింశతి.pdf/143 పుట:బేతాళపంచవింశతి.pdf/144 పుట:బేతాళపంచవింశతి.pdf/145 పుట:బేతాళపంచవింశతి.pdf/146 పుట:బేతాళపంచవింశతి.pdf/147 పుట:బేతాళపంచవింశతి.pdf/148 పుట:బేతాళపంచవింశతి.pdf/149 పుట:బేతాళపంచవింశతి.pdf/150 పుట:బేతాళపంచవింశతి.pdf/151 పుట:బేతాళపంచవింశతి.pdf/152 పుట:బేతాళపంచవింశతి.pdf/153 పుట:బేతాళపంచవింశతి.pdf/154 పుట:బేతాళపంచవింశతి.pdf/155 పుట:బేతాళపంచవింశతి.pdf/156 పుట:బేతాళపంచవింశతి.pdf/157 పుట:బేతాళపంచవింశతి.pdf/158 పుట:బేతాళపంచవింశతి.pdf/159 పుట:బేతాళపంచవింశతి.pdf/160 పుట:బేతాళపంచవింశతి.pdf/161 పుట:బేతాళపంచవింశతి.pdf/162 పుట:బేతాళపంచవింశతి.pdf/163 పుట:బేతాళపంచవింశతి.pdf/164 పుట:బేతాళపంచవింశతి.pdf/165 పుట:బేతాళపంచవింశతి.pdf/166
  1. తనయుఁ డె