Jump to content

బాల నీతి/రాజభక్తి

వికీసోర్స్ నుండి

మున "నాకవ్వడి యెక్కువ గురు భక్తి కలవాడగుటవలన వాయుస్త్రము నుపహరింపగలిగెను. నేనాధనురా చార్యుని పుత్రుడనయ్యు నంతగురుభక్తి లేకపోవుటవలనగదా యుపహరింప జాలనైతి" నని కుందెను.

   తిలకించితిరా! ఆయర్జునుడు గురువువద్దవిద్యనభ్యసించి క్రమముగా నతనికన్న నెక్కుడు బలవంతుడయ్యునాతనియందు భక్తికలవాడగుటవలనగదా తాను లోకవిఖ్యాతుడైనది. మఱియు నతని గురుపుత్రుడుకూడ నుపసంహరింపలేని యస్త్రమును గురుభక్తికలవాడగుట వలన గదా యాయర్జునుడుపసంహరింప గలిగెను. కాబట్టి యట్టులనె పత్రివారును గురుభక్తికలిగియుండిన యెడల వారికి మేలుకలుగును. కాన మున్నెట్టులైనను మనమీదినమునుండి యీవిధమున నుండుదము.

క. సగ్గురుకృప జ్ఞానంబున
    సద్గతిదీవించుచున్న చాలగజదువుల్
    సద్గతిగలుగంజేసెడి
    సద్గురువేడై వమనుజాటర వేమాడి

రాజభక్తి

మనలను సుఖముగా బరిపాలించురాజులయందు భక్తి గానుండుట రాజభక్తియనబడును. రాజున నెవరన మంచికొలమునబుట్టినవాడును, శౌర్యముగలవాడును, నీతిశాస్త్రవిశారధుడును, ప్రభుమంత్రోత్సాహ శక్తిసంపన్నుడును, ధీరులును, సకలశాస్త్రసంపన్నులును, ధర్మతత్వజ్ఞలునగుపండితులును, ప్రభుహితాభిలాషులును, పద సద్విమర్శనజ్ఞానముకలవాడును, రాజనీతిపరులునునగు మంత్రివర్యులను నిరుపమానంబగు పరాక్రమముని నిశ్చలమగుపట్టుదలయు గలిగినభటవర్యులను గలిగినవాడు రాజని పల్కనగు.

ఈరాజు, తనరాష్ట్రములో, గురువైనను దుర్మార్గుడై ముందు వెనుకలు విచారించక యితరులకపకారముల జేయుచుండినయెడల వానిని బ్రకటనముగా జక్కగాశిక్షించును. దూరాలోచనగలిగిన మంచిమంత్రులతోడ నేకాంతమున మంతనం బొనరించి పనులనారంభించి యడ్డుపాట్లురాకుండ దనపనుల గొనసాగించుకొనుచుండును. జనులకు, మంచికొలమును, మంచిబుద్దియును, మొదలగుసద్గుణములకెల్ల నీరాజేకారణము. రాజు దైవముతోసమానుడు. కావుననే నావిష్ణు:పృధివీ పతిన్, అనగా "రాజైనమనుజుడు విష్ణు" వని మనయుద్గ్రందము లన్నియు నొక్కపెట్టున బల్కుచున్నవి. మన మారాజు సాహాయ్యము లేనిదే యేపనిని జేయజాలము. మనధనము గాని ధాన్యముగాని దేనికైన నారాజుయొక్క తోడుపాటులేనిదే నిలుపుకొన జాలము. చూడుడు, మనము భూమిని దున్ని విత్తనములజల్లి నవి మొలకలత్తి క్రమక్రమముగా

19

బాలనీతి.

వృద్దిజెంది పంటపండినతరువాత నింటిధాన్యమున తెచ్చుకొందమనియాసచేనుండ నింతలో నాబూమిని జోరులు సొచ్చిభయమువిడనాడి యాధాన్యమును హరించుచుండగా వారికనులకు మనమగుపదితిమేని మనలదన్ని యెధేచ్చముగా నాపంటానుగొసి తీసికొని పోవుదురు. ఇటువంటి యన్యాయము సంభవించున దేనమయమువలదు? రాజులేనిసమయమునందుగదా కాబట్టి రాజులయొక్క సహాయము ముఖ్యముగా గావలయును. ఇంతయేల? ఆరాజసహాయ్యమువల ననే మనముబ్రతుకుచున్నామని చెప్పనొప్పు.

    రాజు, విద్యలునాశనమగుచున్నటుల గానుపించిన తక్షణమే యవి యబివృద్దికి వచ్చుమార్గము లాలోచించి యబివృద్దికిదీసికొనివచ్చును. జనుల సుఖదుఖముల నారయుచుండును. "వర్ణాశ్రమాచారధర్మంబుల నడుపు " డని బోదించును. బీదలను, సాదలను బోషించుచుండును. దిక్కులేనివారి కెల్ల దిక్కై పోషణ జేయుచుండును. "దుర్బలస్యబలంరాజా" యన వినవే? ప్రజలను రక్షించుచుటవలనను, శిక్షించి సన్మార్గమును జొన్పుటవలనను, దనకొమరులవలె భరించుటవలనను బ్రసిద్దిజెందిన రాజులే రాజులు. తక్కినరాజులు తరాజులని వచింపవచ్చును.
మున్ను శ్రీరాముడు బాల్యముననే విశ్వామిత్రాజ్ఞాను సారముగా జెడ్డవారలగు తాటకామారీచుల దర్పమడాగించెను, యౌవనమున గారణాంతరమున బితాజ్ఞాపరిపాలన నిమి
20

బా ల నీ తి.

త్తమై యడవులకుజని ఖరదూషణ రావణాధ్యసురుల జీఱెను. తదుపతి మగుడ స్వగ్రామమునకువచ్చి యనుజాదులు పరివేష్టించియుండ రాజ్యమధిష్టించి వాసిగాంచెను. కాబట్టియే యిప్పటికి మనవారలు-రామరాజ్యము సుగ్రీవాజ్ఞవానికేమిరా" యని పలుకుచుందురు.

     ఇటుల దగినస్వతంత్రమునొసంగి సుఖముగస బరిపాలించిన రాజులయందు మనము భక్తిగానుండక పోతిమెని దైవమునకు ద్రోహముచేసినవారమగుదము. ంసఱియు విహలొకమునగష్టములు బొందగలంకు. కసవున బ్రతివారును రాజభక్తికలిగియుండవలెను., రాజభక్తి కలిగినవారలు రాజానుగ్రహపాత్రులుకాగలరు. దాన విశేషఫలముల బొందగలదు.
    పైనదెలిపినవిధమున రాజభక్తి గలిగి ఫలముల బొందినవారిత:పూర్వమే చాలమందికలరు. వారిలో నొకనిని జెప్పెద.
డృతరాష్ట్రమహారాజపుత్రుండగుదుర్యోధనుడు కర్ణుడనునొకనిని జేరదీసి సంబాషించుచుండెను. ఆ కర్ణుడారాజునందతిశయభక్తి కలవాడై యుండెను. దానినారాజరాజు కాంచి సంతుష్టిజెంది యంగరాజ్యమునకు రాజుగా నధిష్టింపజేసెను. తదుపరి తన్వనతండ్రికొమరులగు పాండవులకు దమ కుగయ్యము రాజ్యవిషయమున గలిగెను. అత్తఱి నారా

21

బా ల నీ తి.

జీకర్ణునే నమ్ముకొనియుండెను., ఇటులుండ గలహమునాపి పాండవులకు వీరికి సంధిజేయుటకై శ్రీకృష్ణమూర్తి దౌత్యమువహించి వచ్చి ధృతరాష్ట్రాదులతో సంభాషించెను. కానియాయనవచ్చినదానికి వీరువిముఖముగా మాటలాడమొదలిడిరి. అంత దీనిని గృష్ణుడుకాంచి సంధికుదరకఫోయెగదా యని డెందమున విచారించుచు మరలువిషయమున గర్ణుని మాత్రముబిలిచి రహస్యముగా నిటులుబలికెను. "కర్ణా నీవు గురువరాదులందెక్కువ భక్తికలవాడవు ధర్మజ్ఞడవు. కాన నామాట వినుము. గొంత కన్యాత్వమున నదీసమీపమున దుర్వాసదత్తమంత్ర బరీక్షార్ధమై భాస్కరునిగోరి యాతనియనుగ్రహమున నిన్నుగనినది. కాబట్టి పాండురాజాగ్రసూతివైన నిన్ను ప్రాజ్యంబదు రాజ్యంబునకు నాయకునిగా జేయగలరు. నీకు బురవీధుల నుత్సవంంబొనర్తురు. నీకుధర్మరాజు యువరాజై నీప్రక్కననుండి ధవళచామరంబుల విసరగలడు. భీముడు తెలనిగొడుగును బట్టగలడు. అర్జునుడు సారధ్యంబుచేయగలడు. పాంచాలాది సేనా సమన్వితంలుగా నకుల సహదేవులు నిన్ను గొలువగలదు. మఱియు ద్రిలోకసుందరియగు ద్రౌపది కూడ నిన్నువరించగలదు. కాన బాండవుల గలసి పై లాబములంబొందు" మని బోధజేసెను. అంతట రాజభక్తిరతుడగుకర్ణుడు డాకృష్ణుడు సల్పినష్తతికిని, వచించిన లాభములకు నుబ్బక యిట్లుత్తరమొసంగెను. " స్వామీ! మీరు
22

బా ల నీ తి.

చెప్పినదంతయు సత్యమేకాని నన్ను సూతపుత్రుడని నిర్లక్ష్యముచేయక చేరదీసి తనయనుజులకన్న నెక్కుడుప్రేమతో గౌరవించి నేగొరినవానినన్నిటిని దెచ్చియిచ్చి, మన:ప్రమొదంబొనరించుచు నన్ను దనయతవానిగా జేసిన యారాజరాజును విడిచివచ్చుట నీతిబాహ్యమని నీవెఱుగనిదే? నేనాలాభములకై యాసపడను. తుదకు నాప్రాణములనై నగోల్ఫోవుదు గాని రాజద్రోహినిమాత్రము కాజాలనని చెప్పి యారాయబారిని బంపివేసెను. అటుతరువాత గుంతి, "రాధాపుత్రు" డనియనుపించుకొనుచున్న తనపుత్రుడేకాంతముగా భాగీరధీతీరముననుండుట కనుగొని యించుకంత భేదముగా బైవిధముననే బోధ జేసెను. అంతట గర్ణుడు "అమ్మా! నీకొమరుండనైనను జిన్ననాటనుండి వారియన్నముదినివృద్దికివచ్చిన నేను వారిని విడువజాలను. మిమ్ములచేర" నని దృడముగా జెప్పెను. అంత గుంతీదేవికొన్ని విషయము లాకర్ణునడిగెను. వానికి గర్ణుడుత్తరములనొసంగి యీమెను వీడ్కొలిపెను.

కనుగొంటిరా? పాండవులగలసిన ననేక లాభముల బొందగలనని యాకర్ణుడు తెలిసికొనియు రాజభక్తిరతుడై యాలాభముల దృణములుగా భావించి కలియక యుయండెను. అది యెంతనిశ్చలమైనరాజభక్తియో కంటిరా. కావుననే యాకర్ణుడు రాజరాజుచే ననెక ఫలముల నందగలిగెను. కానబ్ర

23

బా ల నీ తి.

స్తుతము మనలను సుఖముగా బరిపాలించెడి రాజులయందు భక్తిగానుండి ఫలములబొందుటకు బ్రయత్నముఛేయుదము.

క. జనులకు నెల్లనుబూజ్యుడు
    జననాయకుడతనిమహిత ♦శాసనమునప్ర
    జ్ఞనులును మునులును సద్విధి
    జనువారలుకాని కడవ జనగాదెపుడున్

భారతము

విద్య.

     విధ్యయనలోకములోనిసమస్తవస్తుగుణస్వభావాదుల దెలిసికొనుట.
      ఈవిద్యయనునది లేనిదే మనుజు దభివృద్ధికి రానేరడు. ఇది కాఱు క్రమ్ముకొన్న చీకటుల ధ్వంసము జెయు సూర్యునిపగిది విరాజిల్లుచుండును. విజ్ఞానమొదవించుచుండును. అపకీర్తి హరించుచుండును., సత్కీర్తి వృద్దిజెందించు చుండును. ఇది మంచి,ఇదిచెడ్డ, యిదిన్యాయ, మిదియన్యాయమను సంగతుల నీవిద్యవలన దెలిసికొనవచ్చును. పరోపకారాది బుద్దులలవడును. నిరామయసౌఖ్యములు చేకూరుచుండును. ఇంకను నీవిద్యను ధనముతో బోల్పదగును. కొన్నికొన్ని కారణములచే నాధనముకన్న నీవిద్యాధనమే యధికమని చెప్ప