బాల నీతి/కృతజ్ఞత
బా ల నీ తి.
మతిని నారక్కసునిజంపి యాపురవాసుల కెంత యుపకారమొనర్చెనో, యెంతసుఖము గూర్చెనో తెలిసిందికదా? కాబట్టియే వారలు పరోపకార మందు బ్రసిద్దికెక్కియున్నవారలు. కావున మనల నితరులు కోరినను, గొరక పోయినను శక్తికొలది నుపకారమొన రించి శ్రేయస్కరముగా నుందము.
ఆ.వె. పరుల కుపకరింప♦పాపక్షయంబగు
పరుల కుపకరింప♦బట్టుకొమ్మ
పరుల కుపకరింప♦బరలోకసాధన
పరుల కుపకరింప♦బలిమి వేమ!॥
కృ త జ్ఞ త.
చేయబడినమేలు నెఱిగియుండుట కృతజ్ఞత యనబడు. అనగా దానితరులచేబొందినమేలును మఱువకుండ నుండుటయే!ఈకృతజ్ఞత కలిగినవారలు కృతజ్ఞలని బల్కబడుదురు. ఈకృజ్ఞలెకృతార్దులని చెప్పనగువీర లితరులచే నింతకుముందున్న పొందిన లాభములే కాక యింకను లాబములుబొందుచుందురు. కాని "ఒఫలానా" వానివలన నాపని కొనసాగినదని తలచుచు నాయుపకారిని సుతించుచు మగుడ నతనికి దాను తగిన
67
బా ల నీ తి.
సాయము జేయుటకై యెక్కువప్రయత్న మొనరించు చుండవలెను. ఇది కృతజ్ఞనికి ముఖ్యలక్షణము.
మన మొక కుక్కను దీసికొనివచ్చి దానికి బ్రతి దినము మనమారగించగా మిగిలినయన్నమును బెట్టెదము. వేయుచుండిన నది గాఢాంధ కారముతో గూగుకొను, నమావాస్యా రాత్రులయందు నిద్ర విడనాడి యనిమిషత్వము నంది మన యింటిచుట్టును దిరుగుచు దొంగల రానీయక మనలను, మనధనాదు లను గాపాడుచుండును. మఱియు నాతన్కరులా ర్భటిని వచ్చినయెడల మనలను నిద్ర నుండి మేల్కాంచునటులజేసి మనల దోడ్కొని యా చొరుల మార్గమును మనకు జూపించుచుండును. అప్పుడు మనమా దొంగల బాఱద్రోలవచ్చునుగదా. ఈకుక్కయే లేనియెడల మనసంగతి యెటులుండునో? పట్టెడన్నమును వేయుచుండిన మనలను మఱవక మగుడ మనకు నెంతయుపకార మొనరించు చున్నదో కాంచితిరిగదా. కాబట్టియె విద్యావిశారదులగు నైఘంటికులు దానికి గృతజ్ఞమనిపేరిడిరి. కృతజ్ఞమనిన కుక్కయని యర్దము. తిర్యగ్జంతువగు నాకుక్క యటుల గృతజ్ఞత కలిగి క్రమ్మఱసాయము జేయుచుండగా నమూల్యం బగు బుద్దిగల మనము కృతజ్ఞతగలవారమై యుండుట యొకచిత్రముకాదు కదా.ఇతరునివలన దానుమేలు బొందినయెడల నది మఱవక యతని కేదో యొక సమయమునందు సహాయము జేసి తీరవలయును. తనకు సాయము జేయుశక్తిలేనితఱి నాయుప
బా ల నీ తి.
కారుల నెదనెల్లప్పుడు నుతించుచుండవలను. ఇతరునిచేదారి గొలది మేలుబొంది యాతనికన్న నభివృద్దిదశకు వచ్చినను నామేలుమఱవక సాయము జేయుట మంచిది. కొబ్బరిచెట్టు పాదున మనము రెందు నెలలు లేక మూడునెలలు మంచియుదకము బోసి కాపాడిన నానారికేలవృక్షము క్రమక్రమముగా బెద్దదై ఫలవంతమైన తరువాత వాని కాదిని రెండు నెలలుమాత్ర ముదకమిదికాపాడిన మనలను మఱవక కృతజ్ఞతకలదై తననెత్తిపై నంతాపహరంబును, నమృత తుల్యంబును నగు జలముతో గూడికొనిన ఫలముల బెట్టికొని తనజీవితాంతమువఱకు నిచ్చుచున్నది గదా. కాబట్టి యితరునిచే గొంచెము లాబముబొందినను గృతజ్ఞత గలిగియుండవలెను. భగవంతుడు, గురువులు, రాజులు, తలిదండ్రులు మొదలగు వారిచే మేలుబొందనివారీ భూతలమున లేరు. కాన వీరలందు గృతజ్ఞత కలిగి యుండవలెను. ఉపకారులదు గృతఘ్నత కలవారు కృతాంతానుగ్రహపాత్రులు. "కృతఘ్నత" యనగా జేయబడిన మేలును మఱచుట. కృతజ్ఞడె కృతముఖుడు కాగలడు. ఇటుల గృతజ్ఞత కలిగి తిరిగి తనకు చేతనైనంత మేలొనరించి వాసిగాంచి వారలు పూర్వులలో గలదు. వారిలో నొకని జెప్పెద.
శ్రీకృష్ణార్జును లగ్నిచే ఖాండవవనమును దహనంబు జేయుచున్న సమయమున మయు డనువాడు రక్షణ సేయుమని ధనం జయుని మరుగు సార నాయర్జునుడు డతనిని రక్షించెను. ఆ సంగతి నీమయుడు మఱువక కృతజ్ఞతకలవాడై మురారితోడ నర్జనుడు సుఖముగా గూర్చున్న తఱి వచ్చి "స్వామీ! నేను దానవ విశ్వకర్మను. శిల్పివిద్యా చమత్కృతియం దుత్తీర్ణుడైన వాడను. కాన నాకు నాడు మేలొనరించిన మీకు దగినంతమేలు జేయలేకపోయినను జేతనైనంత మేలుజేయుటకై వచ్చితిని. కాన మీకిష్టమైనదానిని నిర్మిచెద. ఆజ్ఞాపింపు" డనెను.
అంత నంక్రంద నందనుడు నందనందనుజూచి యితని నొక్క యపూర్వంబగుదానిని నిర్మింపనానతిం డని పలికె. అంత గృష్ణుడు యోచించి మయునిజూచి "నీవు నీవిద్యాసామర్ద్యంబు వినియోగించి యిట్టిదిది వఱకు లేదని యంద అద్భుతముజెందునటుల నొక సభ నిర్మించి తీసికొనివచ్చి ధర్మరాజునకొసంగు మని పలికెను. అటుపై మయుడు సరేయని చెప్పుచు నింకను గదాదులను బీమాదులకు దెచ్చియిచ్చెద నని పలికి యనుజ్ఞగైకొని తనసదనమునకు జనెను. తరువాత వాడు మైనాక పర్వతముమున కనతిదూరముననుండు బిందు సరోవరమునుజేరి యందుండు రత్నాదుల గైకొని యింటికిజేరెను. అంతట నాతడు తానుదెచ్చిన రత్నాదులనన్నింటిని నాసభయందు జొన్పి యనిర్వాచ్యంబగు గాంతిచే ధగద్దగాయమానంబై ప్రకాశించుచుండునటుల బదివేలమూరలు గలిగిన నిడివియును దానికి దగిన వెడల్పును, గలుగునట్లొకసభ నిర్మించెను. దాని నెనిమివేల రక్కసులతో మోపించుకొని వచ్చి బా ల నీ తి.
ధర్మరాజునకిచ్చి గదాదులను భీమార్జునులకొసంగి ధర్మరాజుచే సత్కృతుండై చనెను. ఈసభను బోలుటకు దేవేంద్రాదిసభలును గొఱగావని నారదాది మహర్షులు వచించిరి.
కనుగొంటిరా! ఆమయునికృతజ్ఞత యెట్టిదో! మఱియు నెటుల నాయుపకారులకు మేలొనరించెనో! కావుననే యామయుడు కృతజ్ఞత యందున బ్రసిద్దిని నంది యున్నాడు. కాన మనముగూడ గృతజ్ఞతకల వారమై తిరిగి యుపకారులకు మేలొనరించుచు గృతలక్షణులమగుటకు బ్రయత్నమొనరించు చుందుము.
క.కృతమెఱింగి కర్తనుత్తమ
మతుల సభల సంస్తుతించి♦మఱవక తగన
త్కృతిసేయుడె కృత్మఱిగెడు
పతియె జగజ్జనుల నెల్ల♦బరిపాలించున్
(భారతము.)
దా న ము.
అనగా నిరతులకు ధనముగాని యుపయోగ మగు వస్తువుకాని యిచితముగా నొసంగుటయు, మఱియు నభయమిచ్చుటయు నని యెఱుగదగు.
ఈదాన మెక్కువగాజేయువారలు వదాన్యులని చెప్పబడుడురు. సామాన్యముగా దీనులై, యకుటిల స్వభావులై