Jump to content

బసవరాజు అప్పారావు గీతములు/సౌందర్యపిపాస

వికీసోర్స్ నుండి

నీవె సుమి నాప్రేమ నెమ్మనమ్మందు
జ్ఞాపక ముంచుకోగలవు, రాగల్లు
కాలాల మోదమ్ము, గర్వమున్, శాంతి,
రాగమ్ముతో పవిత్ర మ్మొనర్వగదె !

               -----

            ప్రణయగానము
             (శాఫోగీతము)

కదలేటి రెల్లులకన్న లోలను నేను,
వలపుచే నదిలోని జలమట్తు లైతి
మలయ వాయువుంబోలి యలమె నీపాట నన్
ప్రియుడ ! చపలంపు నాహృది యెల్ల వినెడు
ఇశ్శో యనిన కృంగి, ఈపు మోద మ్మంద
ప్రొద్దుతిరుగుడుపూవు జోలి పొంగును,

               సౌందర్యపిపాస
               (శాఫోగీతము}

అలల నురగలతోడి నాడేటిదేవ !
సర్వదానము లిచ్చు సంద్రంపురాజ !

నను సృజించితివి నీ మనసొచ్చినట్ల
మిగులు ప్రేమించేటి మేటి శక్తిచ్చి
తిస్సి, నాచపలంపు హృదయ మేమందు
నిలను నందపువస్తువుల నెల్ల గోరి
కమలేందువదన నామముల రెండింట
నెది యందమైనదో యేర్పరుపలేము !

                   ప్రేమతర్కము
                  (శాఫోగీతము)

చావే మేలని యంటావే
దేవత లేటికి చావరురా ?
ప్రాణమె చేదని యంటావే,
బ్రతుకుదు రేలను దేవతలు ?
ప్రేమ వొట్తిదే యంటావే,
ప్రేమెంతురేల దేవతలు ?
ప్రేమె సర్వ మ్మంటావే,
ప్రేమింకేమి సేతుమురా ?