బసవరాజు అప్పారావు గీతములు/సమానావస్థ
ప్రణయపారవశ్యము
సరుకుచెట్లను గాలి చల్లగా వీచె
చ్వినతయై యొడ్డుకుం ఐయె కెరటమ్ము
నల్లనౌ నింగిపై నక్షత్ర మొండు
తేజరిల్లెను గొప్పదీపంబువోలె
కర్ణమ్ము జొరదయ్యె కడలిశబ్ధమ్ము
శూన్యమ్ములైతోచె చుక్కలుం గాలి
బంగారు నీ కురుల బావుటా నాదు
వక్షస్థలమ్ముపై బర్వియుండంగ.
----
సమానావస్థ
కాంతిపక్షమ్ములతో గగనమ్మున
కడువ్డి బారెడు నో నక్షత్రీ!
ఇంతజెప్పరాదే ఈ రేయిని
నెచ్చట నీ పయనము నాపెదవో!
నాడి విన్ననౌ వదనముతోడుత
స్వర్గవీధి నొంటిబోవుచంద్రా!
ఏడ నీ యగాధనిశీధమ్మున
తోడు లేక నిద్రింతువె చెపుమా
ఇలు వెడలింపబడిన చుట్తమటు
లిల యెల్లను దిరుగు మందపవనా!
నిలుతు వింక నేకోటరమున నే
యలపయి వేగమ తెలియంజెపుమా.
-----
జీవయాత్ర
జగతి నెల్లెడ వీచి చల్లనిచెట్ల
లలితమ్ములైన పల్లవములన్ పూల
సంచలింపగజేయు చల్లగాలివలె
తీరనికోర్కెతో తిరుగుదు కృష్ణ!
విశ్రాంతి యురుగక వేద్న మ్రక్కు
నాలోచనాయత్తమౌ మరితోడ
మాధవా ! నీరు గుమ్మము జేరువరకు
నీ జీవయాత్ర నెగ్గీంచెదనోయి!