బసవరాజు అప్పారావు గీతములు/ప్రేమశక్తి
Appearance
ప్రేమశక్తి
(శాఫోగీతము)
నిశ్చలసత్యముతో జతగూర్చిన
నెంతో శక్తివంతంబౌ ప్రేమము,
దేవలైనన్ దాని ధాటికిని
లోబడి పోవలసినవారే,
చపలము వికటము నుండీ ప్రేమము
చంపెడు నొకమాటే, యొకచూపే,
కావున, జాగ్రత కాంకులారా,
యేవిధి ప్రేమల మెలగెదరో !
-----
చుక్కలరాక
(శాఫోగీతము)
చెలియింటిముందర కల దొక్కమఱ్ఱి
దిన మెల్ల నట గాలి తీయగా బాడు
సంజ గూర్చుని కలిసి, చల్లనినీలి
నింగి చుక్కలరాక నీక్షింతు మచట