Jump to content

బసవరాజు అప్పారావు గీతములు/జీవమింక దాల్పనేల?

వికీసోర్స్ నుండి

జీవమింక దాల్పనేల?


చెవికింపుగ బారుచు నో
సెలయేఱా యేమందువె?
"చెలియ నిన్ను మోసగించ
    జీవమేల దాల్తు" వనెదె?
చెలియ మోసగించె, నిజమె
జీవమింక దాల్పనేల?
కోర్కులన్ని వమ్ములయ్యె
    కొనుము ప్రాణముల వేగమె!
వెనుకనుంచి కూకూయని
పికమ, నన్ను బిలుతు వేల?
"చెలియ నిన్ను వలచె రమ్ము
    వలదు విడువ ప్రాణ" మనెదె?
పికమ నీదు మాటల విని
వెఱ్ఱి నౌదు ననుకొంటివె?
ఉవిద నన్ను వలచు భాగ్య
    మున్న నింత యేల మునుగు?

పికమ, నా దురంతము చెలి
వీను లలర జెప్పగదవె,
కరుణ మిగిలియున్న నన్ను
    మరువకు మని వేడగదవె?

కామిని (కల)

మల్లికలారా, యేటికి మీకీ
యుల్లాసము నా కెఱుగంజెపుడీ
ఉల్లమ యేటికి నిట్టులు దడ దడ
    నూరక కొట్టుకొనంగన్‌.
అది యేమో నా కనులకు గన్పడు
నతివ యొకో లే కచ్చరయో?
పస దిలకించగ నీ చెలి యప్సర
    భామలనుం దలదన్నున్‌.
వనిత సొగసు నా హృదయరాజ్యమును
వశము గొనియె బలవంతముగా, నీ