Jump to content

బసవరాజు అప్పారావు గీతములు/జీర్ణం జీర్ణం

వికీసోర్స్ నుండి

స్వర్గ వుద్యానాల వాసించు పూవు
నామోటుచేతిలో నలిగిపోనేనె?
భూర్భువర్లోకాల బోయేటి పిట్ట
కటిక నాకౌగిటకైదులో వున్నె !
పరమాత్ముడౌ జగవ్య్వాపి పాపాయి
ఇరుకు నాగుండెలో ఇమిడిపోయేనె?
                ---
            జీర్ణంజీర్ణం

వేదాద్రి శిఖరాన వెలిగిన్నజోతి
మినుకు మని కాసేపు కునికిపోయింది !
దేవలోకమునుంచి దిగినట్టె గంగ
వచ్చిన్న దారినే పట్టి మళ్లించి !
పంజరం దూరిన బంగారు పిట్ట
తలుపు దీ నేనేపొ తర్లి పోయింది !
కాపుర మొచ్చిన కన్ని పాపాయి
యిల్లు కాళీజేసి వెళ్లి పోయాడు !