Jump to content

బసవరాజు అప్పారావు గీతములు/ఆంధ్రవీధి

వికీసోర్స్ నుండి

చేతితోడ బెట్టుకయ భుజింపుచుంటి
గాదె ' యని గద్గదిక బల్కుకాంత గనుమ !

                  ------
           ఆంధ్రవీధి
    (వాయుసందేశమునుండి)

చుట్టు నున్నట్టి పర్వరాల్ పెట్టనట్టె
కోటగా నొప్పు బొబ్బిలికోటదరిని
గాండ్రు గాండ్రని తీండ్రించు తాండ్రపాప
రాయబొబ్బిలిపులి యని ప్రధితకీర్తి
గన్నవీరు దలచి మందగరిని బొమ్మ!
కళకకుం గవులకు హరికధకులకును
పుట్టిని ల్లదె! రణమున దిట్ట యయ్యు,
దొందపోటున శత్రుచే భంగపడిన
విజయరాముని నగరంబు, నిజముజెప్ప
దాని కీ డగు పురము నెందేని గనవు!
చెంత జేరి సముద్రమ్ము చిందులాడ
ఇంపొసగు లతలతో సెలయేళ్లతోడ
                          

రమ్య మైయెప్పు సింహాచ్లముపై న
భక్తవరదు సింహాద్రియప్పని భజించి
యచటి ప్రకృతివిచిత్రమ్ములరసి చనుమ!

పావనక్షేత్రముల కెల్ల పావనమ్ము
మీరి దక్షిణకాశియన్ పేర బరగు
పాదగయతీర్ధమున గ్రుంకి భక్తితోడ
దగ్ధశవహవ్యధూపసంతర్పణమ్ము
కుక్కుటేశరునకు జేసి మ్రొక్కి చనుమ !
పరమసాధ్వి పతివ్రత భర్తతోడ
సాగుమానముజేసిన సచ్చరిత్రి,
కాపుకోడలు కామమ్మ, కలియుగాన
బొందితోడ కైలాసము నందినట్తి
పుణ్యభూమి దర్శింపక పోకు మోయి,
కులము తీరెంచ నేటికి గుణము కల్గ !
కులుకులాడి, మాయావిని, క్రూరమదన
బాణహత, మారుతల్లి,తన్వలసి విఫల
యై నిజేశునితో కల్ల లాది, తనదు
కాలుసేతులు నరికింప,నేల గూలి
నట్టి సారంగధరుమిట్టయదియె ! అచట
చల్లగా వీచుమా, నీదు జాలితెలియ !