ప్రేమ లేదని

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

గీతం[మార్చు]

ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవని నన్ను నేను చాటని
ఓ ప్రియా జోహారులు

మరపు రాకపోతే మనిషే కాడని
కటికరాయికైనా కన్నీరుందని
వలపు చిచ్చు రగులుతోంటె ఆగిపొమ్మని
గడియ పడిన మనసు తలపు తట్టి చెప్పని
ముసురు పట్టి మూగవోయి నీ ఊపిరి
మోడువారి నీడ తోడు లేకుంటిని

గురుతు చెరిపి వేసి జీవించాలని
చెరపలేకపోతే మరణించాలని
తెలిసి కూడ తెలియలేని వెర్రి వాడని
గుండె పగిలిపోవు వరకు నన్ను పాడని
ముక్కలలో లెక్కలేని రూపాలలో
మరల మరల నిన్ను చూసి రోదించని