ప్రతి రాత్రి వసంత రాత్రి

వికీసోర్స్ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఏకవీర (1969) సినిమా కోసం దేవులపల్లి కృష్ణ శాస్త్రి రచించిన లలితగీతం.


పల్లవి :

ప్రతి రాత్రి వసంత రాత్రి

ప్రతి గాలి పైర గాలి

బ్రతుకంతా ప్రతి నిముషం పాటలాగ సాగాలి

ప్రతి నిముషం ప్రియా, ప్రియా పాటలాగ సాగాలి ||| ప్రతి రాత్రి |||


చరణం 1 :

నీలో నా పాట కదలీ

నాలో నీ అందె మెదలీ

లోలోన మల్లె పొదల

పూలెన్నో విరిసి విరిసీ

మనకోసం ప్రతి నిముషం మధుమాసం కావాలి

మనకోసం ప్రియా, ప్రియా మధుమాసం కావాలి ||| ప్రతి రాత్రి |||


చరణం 2 :

ఒరిగింది చంద్రవంక

ఒయ్యారి తారవంక

విరజాజి తీగ సుంత

జరిగింది మావిచెంత

ననుజూచీ, నినుజూచీ వనమంతా వలచింది

ననుజూచీ ప్రియా, ప్రియా వనమంతా వలచింది ||| ప్రతి రాత్రి |||