ప్రణమామ్యహం శ్రీగౌరీసుతం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


రాగం: గౌళ. తాళం: ఆది.

ప్రణమామ్యహం శ్రీ గౌరీసుతం ఫణితల్ప వాసుదేవ భక్తం సతతం ||

గణనాథం అమర బృంద సేవితం ఫణిహార భూషితం మునివర వందితం ||

ధృత చారు మోదకం గజముఖం సితకరామిత గర్వ భంజకం
నతలోక సంతోష దాయకం శ్రిత భక్త పాలకం సిద్ధివినాయకం||