ప్రణమత శ్రీమహాగణపతిం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


రాగం: కానడ - చతురశ్ర త్రిపుట తాళం

ప: ప్రణమత శ్రీమహాగణపతిం - పార్వతీ ప్రియసుతం
    ప్రణత జనాభీష్ట ఫలదం - పరమేశ్వర లాలితం॥

అ: మణిగణశోభిత దివ్యాభరణ భూషితం - మునివినుతం
     ఫణిపతి తల్ప శ్రీవాసుదేవ సంప్రీణితం॥

చ: భారత లేఖన చతురం భక్తజన స్వాంతమందిరం
     వారణ వదనం - ధృతమోదకం - వరపాశాంకుశధరం
     భూరికృపాసాగరం - తారాధీశగర్వహరం
     సురగణ సేనాపతి కుమార సహజం - శ్రీకరం॥