ప్రజారోగ్యం
Appearance
పొగాకు వాడకం - ఫలితాలు
[మార్చు]పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టున్ " అని గురజాడ వారు కన్యాశుల్కం నవలలో గిరీశంతో పలికించారు.ఇది ఎంతవరకూ నిజమోగానీ, మనదేశంలో రోజుకు 2200మంది కేవలం పొగాకు వాడకం పర్యవసానాలతో మరణిస్తున్నారు. సాలీనా 8 నుండి 9 లక్షల మరణాలు భారతదేశంలో పొగాకు వినిమయం కారణంగా సంభవిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా నోటి క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. వీటిలో 90శాతం పైగా పొగాకు వాడకం ఫలితంగా సంభవిస్తున్నాయి. క్షయ, క్యాన్సర్ వంటి ప్రమాదకర పరిణామాలకు దారితీసే పొగాకు వాడకం పట్ల ప్రజలను అప్రమత్తం చేయడానికి కొన్ని విషయాలు తెలుసుకుందాం.