ప్రకృతి కాంతకు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సిరివెన్నెల సినిమా కొసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాట.

పల్లవి:

ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో

పదము కదిపితే ఎన్నెన్ని లయలో

ఎన్నెన్నీ హొయలో, ఎన్నెన్నీ లయలో (2)

సిరివెన్నెల నిండిన ఎదపై, చిరుమువ్వల సవ్వడి నీవై

నర్తించగ రావేలా నిను నే కీర్తించే వేళా || ప్రకృతి ||


చరణం:

అలల పెదవులతో శిలల చెక్కిలిపై

కడలి ముద్దిడువేళా పుడమి హృదయంలో | అలల |

ఉప్పొంగి సాగింది అనురాగము

ఉప్పెనగ దూకింది ఈ రాగము || ప్రకృతి ||


చరణం:

కొండల బండల దారులలో తిరిగేటి సెలయేటి గుండెలలో (2)

రా రా రా రమ్మని పిలిచిన కోన పిలుపు వినిపించగనే (2)

ఓ కొత్త వలపు వికసించగనే ఎన్నెన్నీ హొయలో ఎన్నెన్నీ లయలో || ప్రకృతి ||