Jump to content

పోరా బాబు పో

వికీసోర్స్ నుండి

దీక్ష (1951) సినిమా లోని ఈ పాట ఆచార్య ఆత్రేయ గారి తొలి రచన.


పల్లవి :

పోరా బాబు పో !

పోయి చూడు ఈ లోకం పోకడ ||పోరా|||


ఆవేశాలను ఆశయాలను

వదిన కోసమే వదులుకొంటివా || 2 ||

ఆమెకు నీకు ఋణం తీరెగ

తెగించి చూడు తేలేదేమిటో ! ||| పోరా |||


చరణం 1 :

ఉన్నవూరు కాదన్నావో

వూరు విడిచి పోతున్నావో

ఏ ఘనకార్యం సాధిస్తావో

ఏమౌతావో ఎవరి కెరుకరా ? ||| పోరా |||

చరణం 2 :

దూరపు కొండలు నునుపేనేమో

దోషం నీలో లేదో ఏమో

నీవు నమ్మిన నీతి న్యాయం || 2 ||

నిజమౌనేమో తెలుసుకుందువో ||| పోరా |||


చరణం 3 :

దేశసేవకై దీక్ష పూనమని

ధీరమాత దీవించెను నాన్న

కాకిని కోకిల చేస్తావో || 2 ||

లోకంలో ఒకడైపోతావో ||| పోరా |||