పొలిమేర దాటిపోతున్నా
స్వరూపం
పొలిమేర దాటిపోతున్నా ఓ గువ్వలచెన్నా
పొరుగూరికి చేరిపోతున్నా ఓ గువ్వలచెన్నా
కథ మారే రోజులు కోరేనూ ఓ గువ్వలచెన్నా
కల తీరే దారులు వెదికేనూ ఓ గువ్వలచెన్నా
గుళ్ళో నిను చూడలేకున్నా ఓ గువ్వలచెన్నా
గుండెల్లో దాచుకున్నాలే ఓ గువ్వలచెన్నా
ఏ సీమల తిరుగాడినా ఓ గువ్వలచెన్నా
నీ దీవెనలందించాలన్నా ఓ గువ్వలచెన్నా
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : కె.వి.మహదేవన్