పెద్దాపుర సంస్థాన చరిత్రము/అంకితము

వికీసోర్స్ నుండి

ఆంధ్రగీర్వాణభాషాకోవిదులును

బహుశాస్త్రవిశారదులును

ఉభయభాషాకవులును

వైఘానసధర్మచంద్రికాది గ్రంథకర్తలును

శ్రీరామభక్తులును,

అస్మదాథ్యాత్మిక గురువరేణ్యులును

నగుశ్రీరాజావత్సవాయరాయజగపతిరాజుతాతయ్యగారికిని ---


స్త్రీధర్మపరిపాలకురాలును

సాధ్వీమణియు

నగుశ్రీమతి బుచ్చివెంకయ్యంబాదేవీ బాబయ్యమ్మగారికిని


మాతృహీనుడ నగునన్ను తల్లిలేనిలోప మిసుకంతయు లేకుండ బ్రేముడింజూపి విద్యాబుద్ధులు గఱపి యిప్పటిస్థితికి దీసికొని వచ్చినందు లకు గృతజ్ఞతతో నీగ్రంథమును సమర్పించుకొనుచున్నాడను.


రాయజగపతి.