పుట చర్చ:Womeninthesmrtis026349mbp.pdf/88

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

సవరణలు[మార్చు]

70 వ పుటలో 6 వ పఙ్క్తిలో 'ఆపస్తంబపారస్కరులు' మొదలు 9 వ పఙ్క్తిలో 'నొసగుచున్నది' వఱకు లేనట్లు భావించి యాపిమ్మట నీక్రింది వాక్యములను పూరించు కొనవలెను.

పైన చేయబడిన చర్చయంతయు నాపస్తంబగృహ్య సూత్రము ననుసరించియే చేయబడినది. కాన నిపుడితర గృహ్యసూత్రముల ననుసరించి కూడ నీయంశమును పరిశీలింతము. కొన్ని గృహ్యసూత్రములను బట్టి వివాహములోని దీక్షయొక్క పరిసమాప్తిలో దంపతులకు సమావేశసము జరుగవలెనని స్పష్టముగ కలదు. హిరణ్యకేశి గృహ్యసూత్ర మిట్లు చెప్పుచున్నది.

అథైనాముపయచ్ఛతే (హిరణ్యకేశి 1-7-11-4) (త్రిరాత్రదీక్షానన్తరము వరుడు వధువును పరుండబెట్టి యోనిని స్పృశించి యామెను పొందును.)

బోధాయనుడు గూడ వ్రతాన్తమం దుపనంవేశనము చెప్పుచున్నాడు. అతడు వ్రతకాలపరిమితిలో వికల్పములను సూచించియున్నాడు. అథయదికామయేత శ్రోత్రియం జనయేయమితి ఆరున్ధత్యుపస్థానాత్కృత్వా త్రిరాత్రమక్షార లవణాశినౌ అథఃశ్శాయినౌ వ్రతచారిణావాసాతే చతుర్థ్యాంపక్వహోమ ఉపసంవేశసంచ...... అథయదికామ యేతదేవం జనయేయమితి సంవత్సరమే తద్వ్రతంచరేత్ వ్రతాన్తేపక్వహోమ ఉపసంవేశనం చ (బో. గృ. సూ. 1-7-11)

(శ్రోత్రియుడగు కుమారుని కనవలెనని కోరు దంపతులు అరున్ధత్యుపస్థానము మొదలు మూడునాళ్లు క్షారలవణములులేని యాహారము భుజించుచు క్రింద శయనించుచు వ్రతమాచరింపవలెను. నాల్గవనాడు పక్వహోమము, ఉపసంవేశనము జరుగవలెను....... దేవతుల్యుని కనవలెననని కోరుదంపతులీ వ్రతమును సంవత్సరకాలము చేయవలెను. వ్రతాన్తమందు పక్వహోమము నుపసంవేశనము జరుగవలెను.) పెండ్లికూతు రెంతవయస్సు కలదైనను గూడ సమావేశనము జరుగవలసినదేనా యను ప్రశ్న యుదయించును. రజస్వలకాని భార్యను పొందరాదని గౌతముడు చెప్పిన ట్లిదివఱలో చూచియున్నాము. గృహ్యసూత్రకారుల మతములో వథువు రజస్వల యైనదిగనే యుండవలెనని చెప్పుటకు నేమియు నాధారము లేదు. అంతేకాక యించుమించుగ స్మృతులన్నియు రజోదర్శనానన్తర వివాహమును నిషేధించుచున్న ట్లిదివఱలో చూచియున్నాము. కాన నిచటివధువు రజోదర్శనము కాని రజస్వలయై యుండుటకు వీలున్నది. అనగా పండ్రెండేండ్ల వయస్సుగలదై యుండవలెను. పండ్రెండేండ్లు వచ్చిన బాలికకు రజోదర్శనము కాకున్నను నామె రజస్వల యైనట్లే భావింపవలెనని కొన్ని స్మృతులు సూచించుచున్నవి.

     ప్రాప్తేతుద్వాదశే పర్షేయ: కన్యాంనప్రయచ్ఛతి
     మాసిమాసి రజస్తస్యా: పితాపిబతిశోణితం
                                    (పరాశర. 8- 5)

(పండ్రెండవయేడు వచ్చినదగుచుండగా నెవడు కన్యను దానముచేయడో యాతండ్రి ప్రతి మాసమునను నామె రజస్సును త్రాగుచున్నాడు.)

దీనిని బట్టి పండ్రెండేడ్ల బాలిక రజస్వలయే యని తేలుచున్నది. పైకి రజోదర్శనము కాకున్నను లోన రజస్స్రావమైనట్లే భావింపవలెనని దీని యభిప్రాయము. ఆవయస్సున వివాహమగు వథువునకు సమావేశనము కావచ్చునని గృహ్య సూత్రకారుల మతమని యూహింపవచ్చును. అంతకుపూర్వము వివాహమగుదానికి సమావేశనము లేదని యీవిధముగ నూహింపవలసి యున్నది. ఈ సమావేశనము వివాహాంగమేయని చెప్పవలెను. ఈసమావేశమైన పిమ్మట రజోదర్శనానన్తరము ఋతుకాలములోనే సమావేశనము జరుగును. ఈలోపున జరుగదు. రజోదర్శనానన్తరము చతుర్థ రాత్రమున భర్త చేయవలసిన కృత్యమును వర్ణించుచు బోధాయనుడు,ఆతడామెను పొందును' (అథైనాముపైతి 1-7-44) అని చెప్పియున్నాడు.

ఇదియే రెండవ సమావేశనము. ఇచటి నుండి యనిషిద్ధ దినములలో భార్యను పొందుచుండవలెను. వివాహాంగమైన సమావేశనమునకు పిమ్మటనే ఋతుమతి విషయము ప్రస్తావింపబడుటచే వివాహములో సమావేశనమును విధించిన బోధాయనాదుల మతములోగూడ కన్యదృష్ట రజస్కకాదని తేలుచున్నది. వివాహము దృష్టరజస్కకే ఋత్వితరకాలములో జరుగుచో గూడనిటి ప్రస్తావన కవకాశమున్నది కాదాయనుటకు వీలులేదు. ఏలన నిట పేర్కొనబడిన రజోదర్శనము ప్రథమమే యనుటకు నిటనీయబడిన రజస్వలా నియమములే సాక్ష్యములు. (1-7-22 నుండి 36 వఱకు) ఈవిషయములు వివాహముకాని స్త్రీ రజస్వలయైనను పాటింపవలసినవే కాన వాని నిచటనే చెప్పుటచే వివాహమైనపిమ్మటనే రజస్వలయగుటయే బోధాయనుని దృష్టిలో క్రమమని తేలుచున్నది.

ఆపస్తంబుడు సమావేశనమును వివాహాంగముగ విధింపలేదని యిదివఱలో చూచియుంటిమి. సమావేశనము వివాహాంగమా కాదాయను నంశమున ఋషులలో నభిప్రాయ భేదమున్నట్లు గోభిలగృహ్యసూత్రము చెప్పుచున్నది.

ఊర్థ్వంత్రిరాత్రాత్ సంభవ ఇత్యేకే

                              (గో. గృ. సూ. 2-5-7)

(త్రిరాత్రానంతరము సమావేశనము కావలెనని కొందఱు చెప్పుచున్నారు.) Ramesam54 (చర్చ) 08:04, 14 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]