పుట:Yogasanamulu.djvu/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

198

లంక సూర్యనారయణ


న్ముక్తి, సహజము, తుర్యము అనునవి సమాధి అను పదమునకు పర్యాయ పదములు యోగమునకు ఫలము సమాధి.

మేల్కొన జేసిన కుండలిని మణి పూరక చక్రమును అధిగమించగా ప్రకృతి యొక్క సహజ శక్తులను దిక్కరించ గల శక్తులను యోగి పొందగలడు. కుండలిని సుషుమ్నయందు ప్రసరించగా యోగి అష్ట సిద్దులను క్రమముగా పొందు చున్నాడు. ఒక విషయము పై ధారణ చేసి ధ్యానము చేసి సమాధి గతుడైన స్థితిని సంయమ మందురు. (ఇక్కడ సమాధి అసంపజ్ఞాత సమాధి మాత్రము కాదు) ఈ స్థితిలో ఆ విషయము యొక్క రూపము అదృశ్యమై అర్థము మాత్రము మనస్సున భాసించును. సంయమమున ప్రజ్ఞ పొందుటకు ముందుగా స్థూలము యందునను, రాను రాను సూక్ష్మముల యందూ, సంయమము చేయ వలయును. అనగా ముందుగా కార్యమున సంయమనము చేసి రాను రాను కారణములపై సంయమనము చేయుట అని తెలియ నగును. ఇట్టి సంయమన స్థితి యందు యోగి సిద్దులను ప్రదర్శింప గలడు.

సంయమన కాలమున చిత్తమును బహు సూక్ష్మ స్థితిలో నేకాగ్ర పరచు చున్నాము. అనగా చిత్తము నొక విషయమున నియమించి నపుడు మరియొక విషయమును చోరనీయ కుండు స్థితిని చిత్రైకాగ్రత అని చెప్పనగును. ఒకొక్కప్పుడు మనస్సు అత్యంత అభిరుచిగల విషమున దగుల్కొని నపుడు చీమలు