పుట:Yogasanamulu.djvu/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దండెత్తి ఒకొక్క రాజును జయించి వారి రజ్యములను స్థాపించిరి. కొంత కాలమునకు దేశ మంతయు పర రాజుల పాలన లోనికి పోయినది. విదేశీయులు రత్న రాసులను తరలించు కొని పోయిరి. వారితో పాటు జ్ఞాన భాండాగారములైన విలువైన గ్రంధములను కూడ తరలించు కొని పోయిరి. గొప్ప గ్రంధములను పారశీక, గ్రీకు, చీని భాషలలోనికి అనువదించు కొనిరి. మనకు కూడ స్వదేశీయ నాగకత యందు అభిమానము సన్నగిల్లినది. కూటికి కొరకు విదేశీయులకు తొత్తులై బానిసలుగా బ్రతుకుటయందే అభిరుచి వృద్ధి యైనది. రామాయణ కాలము నాటి కన్నా పూర్వమున వెలిసిన వేదముల యందు ఖగోళ శాస్త్రము చర్చింపబడి యుండగా నేటి వైజ్నానికులు నక్షత్ర శాస్త్రమున మారే యితర శాస్త్రముల యందు భారతీయ ప్రతిభ గురించి ముచ్చటించరు. గ్రీకులు, రోమనులు, పారశీకులు, చైనీయులు ఆయా శాస్త్రమున కృషి చేసినట్లు చెప్పచున్నారే కాని భారతీయుల సంగతి ముచ్చటింపరు. వేదములకు కాలమును నిర్ణయించలేనిది. అట్టితరి వేదవ్యాసుని కాల నిర్ణయము చేసి వేదములు రెండు వేల సంవత్సరముల నాటివని నిర్ణయించు చున్నారు. ఇదంతా మన బానిస ప్రవర్తనను అలుసుగా తీసుకొని చేయుచున్న అన్యాయము, అవమానము. స్వాతంత్య్రము పొందినా రక్తములో ఎనిమిది వందల సంవత్సరముల నుండి అనుబ్ హవించిన బానిస ప్రవృత్తి ప్రవేశించి నందున మనకు కలుగు తున్న హానిని, ప్రపంచములో మనకు జరుగు