పుట:Yenki Paatalu Nanduri Venkata Subba Rao.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అణకువ

ఎంతెంత దూరాన
ఎందరిలొ నేనున్న--
సూటిగా నా వెనుక చూసి నా యెంకి
చురికి నే తనవైపు తిరుగవలసినదే !
* * *
ఏటవల నేబోయి
యిల్లుచేరని రేయి---
ఏటదీపము పళ్ళ నిడినదా యెంకి
వెలుగులో నే నచట మొలవ వలసినదే !
* * *
కథనడుమ మాగా జోడు
నిదుర దోగిననాడు---
కథకొస తళుకుగోరి కల గనెన యెంకి
కలనునే జొరి కథలు తెలుపవలసినదే !
*

యెంకి పాటలు (11) 81