Jump to content

పుట:Yenki Paatalu Nanduri Venkata Subba Rao.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాటేలా?

సాటేలా? నీకు మాటేలా? సిన్నతనమేలా? సిగ్గేలా?
ఆసీమ యీ సీమ
అందరందాలు
తిన్నంగ నినుసూసె
దిద్దుకుంటారు!
సాటేలా? నీకు మాటేలా?...
ముందు మన పాపణ్ణి
కింద దిగనీరు,
యెంకి కో వంటారు
యెత్తుకుంటారు!
సాటేలా? నీకు మాటేలా?......
యెం కొక్క దేవతై
యెలిసె నంటారు_
యింటింట పెడతారు
యెంకి నీ పేరు!
సాటేలా? నీకు మాటేలా? ...