పుట:Yenki Paatalu Nanduri Venkata Subba Rao.pdf/21

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


యేటిదరి నాయెంకి

'యీరేతి రొక్కతేవు యే మొచ్చినావే ? '

'ఆడు నే నిక్కడే ఆడినామమ్మా !'

'యేటి నురగలకేసి యేటి సూశేవే ?'

'మా వోడి మనసట్టె మరుగుతాదమ్మా !'

'సెంద్రవొంకలొ యేమి సిత్ర మున్నాదే ? '

'వొంక పోగానె మావో డొస్తడమ్మా !'
"ఆడు నే నిక్కడే ఆడినా మమ్మా !
మావోడి మనసట్టె మరుగుతాదమ్మా !
ఆ వొంక పోగానె ఆడొస్త డమ్మా!"

8 యెంకి పాటలు