పుట:Womeninthesmrtis026349mbp.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాధ్యాయము

41

అనన్యపూర్వికాం కాంతామసహిడాం యవీయసీం

(యాజ్ఞ. 1-53)

(పూర్వ మితరుని పొందనిదియు, సుందరియు, నసపిండకానిదియు, తనకంటె చిన్నదియునగు స్త్రీని వివాహమాడ వలెను.)

వసిష్ఠుడు 'అనన్యపూర్వాం' అనుటకు మాఱుగ 'అస్పృష్టమైథునాం' (మిథునకర్మ పొందనిదానిని) అని చెప్పియున్నాడు.

అస్పృష్టమైథునామ వరయవీయసీం.

(వసి. 8-1)

సత్ర్పవర్తనయు, సర్వావయవ పరిపూర్ణతయుగూడ వధువునకు ప్రథానములే యని చాలస్మృతులు చెప్పుచున్నవి.

సర్వావయవసంపూర్ణాం నువృత్తాముద్వహేన్నర:

(హారిత 4-2)

(సర్వాయవ సంపూర్ణయై, మంచినడతగల్గి యున్న దానిని వివాహమాడవలెను.)

రోగముగల కన్యను వివాహమాడరాదు.

బంధుశీలలక్షణ సంపన్నా మరోగా ముపయచ్ఛేత.

(ఆప.గృ.సూ 1-19)

(బంధుశీల లక్షణసంపన్నయు నరోగయునగు దానిని వివాహమాడవలెను)