పుట:Womeninthesmrtis026349mbp.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాధ్యాయము

7

వసిష్ఠుడు మాత్రము పుత్రికకే ద్వాదశ పుత్రులలో మూడవస్థానము నొసగుచున్నాడు.

"తృతీయ:పుత్రికా'

(27-15)

కాని యిట నామె కౌరసునితొ సమాన ప్రతిపత్తి లేదు. యాజ్ఞవల్క్యుడు మనువువలెనే పుత్రికాపుత్రునకే పుత్రతుల్యత్వము నంగీకరించుచు

ఔరసోధర్మపత్నీజ: తత్పమ: పుత్రికాసుత: (2-126)

(ధర్మపత్నివలన పుట్టినవా డౌరసుడు. పుత్రికాపుత్రు డామెతో సమానుడు) అని చెప్పియున్నాడు.

పైన తెల్పబడిన విధముగ కుమార్తెను పుత్రికనుగచేసి కొనుటకు పుత్రికాకరణమని పేరు. అదిమూడు విధములుగ జరుగ వచ్చునని స్మృతికారులభిప్రాయ పడుచున్నారు.

(1) గౌతమధర్మసూత్రమీవిధముగ చెప్పుచున్నది;

పితోత్పృజేత్పుత్రికామనపత్యో గ్నింప్రజాపతించేష్ట్వా స్మదర్థమపత్యమి తిసంవాద్య

(గౌతమ 38-18)

(పుత్రహీనుడు ప్రజాపతికిని నగ్నికిని హోమముచేసి యీమె పుత్రుడు నాకొఱకగునని చెప్పి యామెనుదానము చేయవలెను.)

(2) ఇట్లగ్నిసాక్షిగ కాకపోయినను నోటిమాటచేతనైనను నీనియమము చేసి కొనవచ్చునని కొందఱిమతమని గౌతమ ధర్మసూత్రమే చెప్పుచున్నది.