పుట:Womeninthesmrtis026349mbp.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

166

స్మృతికాలపుస్త్రీలు

ఆత్రేయీం చస్త్రియం

(ఆ.ధ.సూ. 1-24-9)

సామాన్య బ్రాహ్మణస్త్రీని చంపుచో క్షత్రియాదులను జంపునపుడు వచ్చు పాతకమే వచ్చును.

స్త్రీశూద్రవిట్ క్షత్రవధోనాస్తిక్యంచో పపాతకం

(మను. 11-66)

పురుషశిశువును గర్భమున ధరించుటకు తగిన స్థితిలో నున్నది కావుననే యాత్రేయి యెక్కుడు నహంతవ్యురాలని తోచుచున్నది. ఈయంశ మీక్రింది సూత్రమువలన స్ఫురించు చున్నది.

గర్భంచతస్యావిజ్ఞాతం

(ఆ.ధ. 1-24-8)

(బ్రాహ్మణగర్భము స్త్రీ పున్న పుంసకభేదము స్పష్టము కాకుండ చంపబడినను బ్రహ్మహత్యాదోషమే వచ్చును.)

ఆగర్భము పురుషుడగుట కవకాశమున్నది కావున నా యవకాశము ననుసరించియే యాదోషమునకు ప్రాబల్యము వచ్చినది.

స్త్రీ పురుషుల కిట్టిభేదము చాలవిషయములలో నంగీకరింపబడినది. బ్రాహ్మణుని యుచ్ఛిష్టము దినవచ్చును గాని స్త్రీ యొక్కయు ననుపనీతుని యొక్కయు నుచ్ఛిష్టము తినరాదు.