పుట:Womeninthesmrtis026349mbp.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సప్తమాధ్యాయము

135

    "బంధుమధ్యే వ్రతం తాసాంకృచ్ఛ్ర చాంద్రాయణాదికం |
     గృహేషు సతతం తిష్ఠేచ్ఛు చిర్నియమమాచరేత్"
(పరాశర 9-58)

(స్త్రీలకు కృచ్ఛ్రచాంద్రాయణాదికములగు వ్రతములు బంధుమధ్యమునే చేయతగినవి. వారు నిత్యము గృహమందే యుండి శౌచమును నియమమును పాటింపవలెను.)

భార్యచేసిన పాపములకు భర్త ప్రాయశ్చిత్తము చేసి కొనుటగూడ గలదు. ఏలన: వారిరువురును నొకేశరీరముగదా!

    "పతత్యర్థం శరీరస్య యన్యభార్యాసురాం పిబేత్
    పతితార్థశరీరస్య నిష్కృతిర్హి విధీయతే
    గాయత్రీం జపమానస్తు కృచ్ఛ్రంసాతం వనంచరేత్
    గోమూత్రం గోమయక్షీరం దధిసర్పిః కుశోదకం
(పరాశర. 10-26, 27)

(ఎవని భార్య సురాపానము చేయునో నాతనిభార్య పతితురాలగుచున్నది. కాన నర్థశరీరమగు భర్తకు ప్రాయశ్చిత్తము చెప్పబడినది. అతడు గాయత్రిని జపించుచు గోమూత్ర గోమయ గోక్షీర దధిసర్పిస్సులను భుజించుచు కృచ్ఛ్రసాంతపనము చేయవలెను.)

దీనింబట్టి భార్య పాపమును భర్త పంచుకొనునని తెలియుచున్నది. అంతియే కాదు. భార్యచేయు పాపములు భర్తకే యంటునను వచనముకూడ గలదు.