పుట:Womeninthesmrtis026349mbp.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాధ్యాయము

103

(వితంతువు ఆమరణాన్తరమోర్పుగలదై, యింద్రియ నిగ్రహముగలదై బ్రహ్మచారిణియై సర్వోత్తమమైన యేకపత్నీ ధర్మమును కోరుచున్నదై యుండవలెను.)

ఒకసారి వివాహమైన స్త్రీకి మఱొకసారి వివాహము చేయుట కెంతమాత్రమును వీలులేదు. ఏలన, కన్యాదానమగుటతోడనే భర్త కామెపై స్వామిత్వము వచ్చుచున్నది.

ప్రదానం స్వామ్యకారణం.

(మను. 2-152)

కావున నామెను మఱొకరికిచ్చుట కెవ్వరికి నధికారము లేదు. వివాహితను మఱల దానముచేయుటకే కాక పాణిగ్రహణము చేయుటకు కూడ వీలులేదు. ఏలన: పాణిగ్రహణ మంత్రములు కన్యలందు వర్తించును గాని యకన్యలయందు వర్తింపవు.

     పాణిగ్రాహణికామంత్రాః కన్యాన్వేవప్రతిష్ఠితాః
     నాకన్యాసుక్వచిన్నౄణాం లుప్తధర్మక్రియాహితాః
                                           (మను 2-226)

(దీనియర్థము పూర్వధ్యాయమున వివరింపబడినది)

మనువు మతములో వాగ్దత్తయై వివాహితకాకుండగనే వాగ్దానపతిని కోల్పోయినస్త్రీకికూడ మఱొకపురుషుని వివాహమాడుట కధికారములేదు. ఆమెకూడ వివాహితయై భర్తనుకోల్పోయిన యపుత్రవలెనే నియోగము చేసికొన