పుట:Womeninthesmrtis026349mbp.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

90

స్మృతికాలపుస్త్రీలు

మగుచున్నది. నాపూర్వగ్రంథములో నవశ్యాపాకరణీయములుగ నిరూపింపబడిన మూడు ఋణములలో రెండు ఋణములు (దేవపితౄణములు) భార్య యున్ననే కాని యపాకరింపబడుటకు వీలులేదని యీవిధముగ తేలుచున్నది. ఈఋణములను తీర్పకుండ మోక్షమునకు యత్నించుటకు కూడ వీలులేదని స్మృతులు తెల్పుచున్నవి.

    అనధీత్యద్విజో వేదాననుత్పాద్య తథాసుతాన్
    అనిష్ట్వా చైవ యజ్ఞైశ్చ మోక్ష మిచ్ఛన్ వ్రజత్యధః
(మను 6-37)

(వేదములను జదువక, పుత్రులను కనక, యజ్ఞములను జేయక మోక్షము గోరువాడు పతితు డగును.)

మానవుడు తానే పుత్రరూపమున జన్మించుచున్నవాడగుటచేతను దుష్టమాతకు దుష్టపుత్రుడు గల్గును గావునను తనను దుష్టత్వమునుండి కాపాడుకొన దలచువాడు తప్పక భార్యను సన్మార్గవర్తిని గావింపవలెను. భార్య చెడ్డది యగుచో తన జన్మ చెడ్డదీ యగును; తన చరిత్రము చెడ్డ దగును; తాను చెడ్డవా డగుచున్నాడు. కావున భార్యను చక్కని స్థితిలో నుంచుకొనుట ప్రతిమానవునకును నవశ్యకర్తవ్యము. <poem>

    పతిర్భార్యాం సంప్రవిశ్యగర్భో భూత్వేహ జాయతే
    జాయాయాస్తద్ధిజాయాత్వం యదస్యాం జాయతే పునః
(మను 9-8)