పుట:Womeninthesmrtis026349mbp.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాధ్యాయము

87

ఉత్కృష్టుడైన భర్త తన సుగుణప్రభావముచే భార్యయొక్క నైచ్యమును బోగొట్టి యామె నుద్ధరించునట్లే పతివ్రతయైన స్త్రీకూడ పాపియైన భర్తను పుణ్యాత్మునిగ జేయగలదు.

    వ్యాలగ్రాహీ యథావ్యాలం బలాదుద్ధర తేబిలాత్
    తథాసాపతిముద్ధృత్యతేనైవ నహమోదతే
(దక్ష 4-20)

(పాములవాడు పామును బిలమునుండి పైకి లాగునట్లు సహగమనము చేసిన స్త్రీ పతి నీచుడైనను నాతని నుద్ధరించి స్వర్గములో నాతనితో మోదము నొందును)

భర్త యుత్కృష్టతచే భార్యకుగూడ నుత్కృష్టత వచ్చుట కేవలము నాధ్యాత్మికవిషయములోనే కాదు. లౌకికవ్యవహారములలో గూడ నట్లే జరుగును. వయస్సు యొక్క యాధిక్యముచే జ్యేష్ఠుడు కనిష్ఠునకు పూజ్యుడు. జ్యేష్ఠుని భార్య కనిష్ఠునికంటెను వయస్సులో చిన్నదే యైనను నాతనికి పూజ్యురాలే యగును. ఏలన నట్టి సందర్భములలో భార్య భర్తతో సమానమైన వయస్సు గలదిగనే పరిగణింప బడును.

పతివయసః స్త్రియః

(ఆ.ధ.సూ. 1-16. 21)

(స్త్రీలు పతి వయస్సుతో సమానమైన వయస్సు గలవారు.)