Jump to content

పుట:Wikipedia Gurinchi Meeku Telusa?.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్

తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ 2024 ఫిబ్రవరి 29న వికీమీడియా ఫౌండేషన్ ఆమోదంతో ఏర్పడింది. గ్రూప్ లక్ష్యాలు ప్రధానంగా:

• తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల (బహుళ భాషల ప్రాజెక్టులు సహా) అభివృద్ధి, ప్రాచుర్యం కోసం కృషి చేయడం;

• మరింతమంది తెలుగువారికి వికీమీడియా ప్రాజెక్టుల గురించి తెలియజెప్పడం, వాటిలో శిక్షణనివ్వడం.


• తెలుగు వికీమీడియన్లు, ఇతర భారతీయ భాషల వికీమీడియన్లు ఒకరి అభివృద్ధి, కృషి గురించి మరొకరు తెలుసుకుని, ఒకరి నుంచి మరొకరు నేర్చుకోవడానికి వీలు కల్పించడం.

• తెలుగు వికీమీడియన్లు వికీమీడియా ప్రాజెక్టులకు మరింతగా మెరుగ్గా కంట్రిబ్యూట్ చేయడానికి అవసరమైన నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు మెరుగుపరచడానికి కృషిచేయడం.

• తెలుగు వికీమీడియా సముదాయం చేపట్టే కార్యకలాపాలకు అవసరమైన మేరకు మద్దతు ఇవ్వడం.

గ్రూప్ లక్ష్యాలకు తగినట్లుగా తెలుగు వికీలో ఆన్లైన్ శిక్షణా కార్యక్రమాలు (తెవికిబడి), బయటి అవగాహన, శిక్షణా కార్యక్రమాలు, వికీమీడియన్లతో సమావేశాలు, హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో విస్తృత ప్రచారం, వికీమీడియా కామన్స్, వికీసోర్స్ లలో ప్రత్యేకమైన ప్రాజెక్టులు వంటివి నిర్వహిస్తున్నారు. తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు రూపొందించాలి, కార్యక్రమాలు మరింత విస్తరించాలనే ప్రణాళికలో ఉంది.