అధ్యక్షుని వచనము డాంధ్రుఁడు. ఈతఁడు ప్రసిద్ధికిఁ దెచ్చినది పూర్వమీమాంసాపద్ధతి. అట్లగుటఁ దెలుఁగు దేశములో నీతని పద్ధతిని విశేషముగ నవలం బించిరి. దీనికి దృష్టాంతము పై నుదాహరింపఁబడిన “ అథ్వర విధాన పుణ్య సమృద్ధి" మొదలగునవి. నన్నయభట్టియు " అవిరళజపహోమ తత్పరుఁడు ” పరమవైదికి, ప్రకృత మభావసిద్ధిని వహించిన వైదిక " క్రియ లాకాలమునఁ బునఃప్రచారమునకు వచ్చుట కారంభించెననియు, దీనికిఁ గారణభూతులలో ముఖ్యుఁ డైన కుమారిలభట్టును ననుసరించిన వారిలో రాజరాజు నొక్కఁ డనియు నా యూహ. ఈ యూహ రాజుయొక్క చరిత్రమును విశదపఱుచుచున్నది. మఱియు నీయూహ సరియైనపక్షమున “ ఆంధ్రవాఙ్మయ మప్పు డేల సృష్టికి వచ్చెను ? తత్పూర్వ మేల రాకయుండెను," అను సమస్యలను విడఁదీయును. నన్నయకుఁ బూర్వ మాంధ్రమునఁ బద్య రచన యుండెను; ఛందస్సు నుండెను. కావ్యములు మాత్రము లేవు ! ఈవింత కేమి కారణము నన్నయకుఁ బూర్వము తెనుఁ గునఁ గవిత్వమే లేదనియు నతఁడు మొట్టమొదట లక్షణముల నిర్మించి లక్ష్యములఁ దీర్చి వాఙ్మయమును సృష్టించెననియు నమ్మువా రెవ్వరు నీనాఁటికిఁ గాన రారు. " మహి మున్ వాగనుశాసనుండు సృజియింపన్ " అనుమాట, కవుల సామ్రాజ్యమునకుఁ జేరిన యతిశ యోక్తి; చరిత్రకారు లాదరింపఁ దగినది కాదు. యుద్ధమల్లుని బెజ వాడ శాసనము మొదలగు దృష్టాంతములచే నన్నయ సృష్టి రద్దుపడి నది. అయినను " అతనికిఁ బూర్వము గొప్పకృతులు వ్రాయఁబడెనా? వ్రాయఁబడియున్న చో వానిగతి యేమయ్యెను ? " అను ప్రశ్నములు తట్టక మానవు. వీని కేమి యుత్తరమి త్తము ? “ త్తరమిత్తము ? " మహమ్మదీయులు తగులఁ బెట్టిరి. " అని పూర్వమన్ని సమస్యలకు నొకే యల్పసమాధానముఁతో దృష్తివడయు చుంటిమి. హేతువాదము ముదిరినయీ కాలములో నది 4 2 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri
పుట:Vyasa Manjari (Telugu) By C. Rama Linga Reddy, 1939.pdf/23
స్వరూపం