v
ప్రయోగము భాషాస్వచ్ఛతకు ఉపహతికల్పించును. రెడ్డిగారు అట్టి స్వచ్ఛతాభ్రంశమును బొత్తిగా ఒల్లరు. మణి, పూర్వపదములనే అపూర్వార్థములకు తగినట్లు మలతురు. ఈ దుర్ఘటనియమమును అసిధారా వ్రతముగా పరిపాలించుట చేతనే వీరు తమ శైలిని స్వచ్ఛతామహిత ముగా నొనర్పగల్గిరి. అన్య భాషాపద కళంకితము కాని, అచ్చపు స్వభాషలో, శాస్త్రగ్రంథమైన అర్థ శాస్త్రమునే చిన్న నాడు వ్రాయగల్గిన వీరికి వ్యాసములు వ్రాయుట యేమి లెక్క.
ఈ విధముగా నానాగుణశోభితములైన వీరి వ్యాసములన్నియు -అప్పుడప్పుడు అవసరమును బట్టి అనేకకాలముల వ్రాసినవి ఒక్కచో చేర్చి, సమగ్ర సంపుటముగా ప్రకటించుట భాషకు మేలు నేతయని మిత్రులు హెచ్చరించగా, శ్రీ రెడ్డిగారు ఆమోదించుటయే కాక, ఈ వ్యాసమంజరిని విశ్వకళాపరిషత్తునకు సొత్తుగా దాన మొనర్చి, వారి కృతజ్ఞతకు పాత్రులైరి. మఱియు తమ తమ గ్రంథములకు పీఠికలుగా నున్న వ్యాసములను, ఈ సంపుటిలో చేర్చుకొనుటకు అనుమతించిన కవులకు విశ్వవిద్యాలయము పరమున కృతజ్ఞత తెలుపుచున్నాను.
ఈ వ్యాసములన్ని టిని సేకరించి, ప్రకటించు భారము నేను పూనితిని. వ్యాసములను విషయభేదమును బట్టి ఖండములుగా వర్గీక రించుటయు, వ్రాతతప్పులు దిద్దుటయు తప్ప నేను పడిన పాటేమియు లేదు. నాకు అచ్చుపూఫులు దిద్దు నేర్పులేదు; అలవాటు అంతకు మున్నె లేదు. అయినను, శక్తివంచనలేక చేతనైనంతవఱకు, సవరిం చితిని. ఇంకేవేని పొరపాట్లున్న వేమో, పాఠకులు మన్నింతురు గాక.
వాల్తేరు 22-9-1939 } పింగళి లక్ష్మీకాంతం