iii
రము. మనభాషలో ఈ గ్రంథరాజమునకు ప్రతిబింబములుగా ఇటీవల అనేకతత్వవిచారములు పుట్టినవి. అవన్నియు ఇంచుమించు ఈ మాతృస్తన్యమును గ్రోలిన శిశువులే. కళాపూర్ణోదయపరామర్శమును నిమిత్తముగా గైకొని, వీరా గ్రంథమున మన కపూర్వములైన అనేక శళాధర్మములను ప్రతిపాదించి, వ్యాఖ్యాన మొనర్చిరి. అట్లే ఆధునిక కవుల నాదరించి ప్రోత్సహించుతలంపున వారిఖండ కావ్యములకు పెక్కిం టికి తొలిపలుకులు వ్రాయుచు, విమర్శసారస్వతమును మఱికొంత వృద్ధికి తెచ్చిరి. ఒక వంక భారతకళాపూర్ణోదయాది ప్రాచీన కావ్యముల నారా ధించుట, ఇంకొకవంక బాలకవుల భావగీతములను ఆదరించుట ! ఈ. ప్రాచీన నవీన తాసమరస భావము నిజముగా ప్రశంసార్హము. దేశకాల నిరపేక్ష మైన గుణగ్రహణ పారీణత అచ్చపు సహృదయతగల వారికిగాని ఉండదు. అది లేకయే ప్రాచీన తాభిమానులు నవ్యకవిత్వమును, నవీన తాభిమానులు ప్రాచీన కవిత్వమును నిరంతరము శపించుచున్నారు.
ఆధునిక కవిత్వములో నైనను, సరసతతోపాటు నియమబద్ధత కలదాని నే వీరు కొనియాడుదురుగాని, విశృంఖల విహార మొనర్చు దానిని మెచ్చరు. సముచితనియమపరిపాలనము, నిరర్థక బంధవిచ్ఛేదము, అస్వతంత్ర తాతిరస్కారము—ఇవియే వీరు పదింపదిగా సాంఘికాచార విషయమునను, కావ్యమర్యాదావిషయమునను బోధించుధర్మములు, వీరి ఉపన్యాసములలో, వ్యానములలో, ఈ ధర్మత్రయమే ఆత్తగా భాసించుచుండును.
విమర్శకులలో వీరికెంత ప్రాధాన్యమున్నదో, వ్యాసరచయితల లోను అంత ప్రాధాన్యమున్నది. సాహిత్యాంగముగా పరిగణింపదగిన వ్యాసరచన ఆంగ్ల భాషలోవలె మన భాషలో ఇంకను పరిణ తావస్థకు రాకున్నను, జరిగినంతవరకు దాని పెంపునకు కారణభూతులైన విద్వాంసులలో వీరొకరు. గ్రంథములకు పీఠికలు వ్రాసినను, పత్రికలకు వ్యాస