ఈ పుట ఆమోదించబడ్డది
87
అడలు గింజలు:... కూడ నౌషధములో నుపయోగ పడుచున్నది. అవి దోస గింజలవలె నుండును గాని కొంచెమెర్రగా నుండును. ఈ గింజలను నూరి పట్టించినచో గొన్ని నొప్పులు తగ్గును. గింజలను నమిలి మింగిన గాని, పొడుము చేసి నీళ్ళలో గలిపి పుచ్చు కొనిన గాని జిగట విరేచనములు కట్టును.
- క్యాబేజి
- ... కూడ నీ కుటుంబములోనెదె. ఈ మొక్క అయిరోపా దేశస్తులతోడనే మన దేశమునకు వచ్చెను. అంతకు పూర్వము లేదు. ఇప్పుడైనను మనము తరుచుగా దీనిని వండుకొనుట లేదు. మరియు గొప్ప పట్టణములందు దప్ప అన్ని చోట్ల దొరకదు. మనము కూర వండుకొను క్యాబేసి లేత యాకుల మొగ్గ.
వాయింట కుటుంబము
వాయింట మొక్కమూడడుగులెత్తు వరకు బెరుగు నేక వార్షికపు గుల్మము. కొమ్మల కొక్కొక్కప్పుడు రంగుండును. లే గొమ్మలపై రోమములును జిగటయు గలదు.
- ఆకులు
- ... ఒంటరి చేరిక, మిశ్రమ పత్రములు: తాళ పత్ర వైఖరి అయిదు చిట్టి యాకులు గలవు. చిట్టి యాకులకు దొడిమ లేదు. అన్నియు సమముగా నుండవు, సమాంచలము, కొన సన్నము, రెండు వైపుల జిగురు జిగురుగా నుండు రోమములు గలవు. తొడిమపై జిన్నచిన్న ముళ్ళవంటివి గలవు.