Jump to content

పుట:VrukshaSastramu.djvu/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డకు వాడిపోకుండ కాపాడుచుండును. పువ్వులు పెద్దవి. ఒక్కొక్క చోట నొక్కక్కటియేనుండును. పుష్పభాగములు వలయమునకు మూడు చొప్పుననే యుండును. ఈ కుటుంబము, తిప్ప గీగె, సీతాఫలము కుటుంబములని బోలి యున్నది. గాని ఆకులకు గణుపు పుచ్ఛములు గలవు. మరియు రక్షక పత్రములును ఆకర్షణ పత్రముల వలె నుండును. ఈ కుటుంబపు పెక్కు మొక్కల పుష్పములలో వృంతాగ్రము పొడుగై దానిపై పుష్ప భాగములు ఒంటరి చేరికగ, నమర్చి యుండుట చూడవచ్చును.

చంపక వృక్షమును (సంపంగి చెట్టును) దోటలందు బెంచుచున్నారు. ఈ చెట్టు విశేషముగ విషాఖపట్టణ ప్రాంతముల నున్నది. ఇది ఆకుపచ్చని పువ్వులు పూసెడు గుబురుమొక్కయగు సంపంగికాదు. దీనిపువ్వులు పచ్చగనుండును. దీనినే సంపెంగయని కూడ నందురు.

సంపెంగ పువ్వులును బెరడును కషాయము గాచి యిచ్చిన మన్యపు జ్వరము తగ్గునట. పువ్వుల కషాయము బలమును, అన్నహితేవును కలుగ జేయును.

అనాసపువ్వు: -- మొక్క మనదేశములోనిది గాదు. ఇప్పుడక్కడక్కడ బెంచు చున్నారు. దీని కాయలును, కాయలనుండి దీసిన చమురును అజీర్ణము నీరసములకు బని