Jump to content

పుట:VrukshaSastramu.djvu/462

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

458

అండకోశను ఉచ్చము. ఒక గది. ఒక అండము. కీలము గుండ్రము చివర రెండు చీలికలుగ నున్నది. గింజకొంచము గుండ్రముగానుండును.

ఈ కుటుంబములోని మొక్కలు చిన్న గుల్మములు. అన్నియు గడ్డి వలె నుండును. వీని ఆకుల పాద పీఠము పూర్తిగ గొట్టము వలె నుండును. పుష్పములలో పుష్ప కోశము, దళ వలయము లేదు. తుషములు గలవు. వాని లోపల కింజల్కములు అండ కోశము విడివిడిగా నైనను కలిసి యైనను వుండును. సాధారణముగ కింజల్కములు, మూడు, మూడు లోపు గా నుండును. అండాశయపు గది యొకటి. అందొకటియే అండ ముండును. కీలము చివర రెండో మూడో చీలికలు గలవు.

పూరిగడ్డి దుంపలు కరవుకాలమునంది పోగు చేసి, చెరిగి, ఉడక బెట్టి తిందురు. కొందరు వాని నెండ బెట్టి పిండి గొట్టి రొట్టెలుగా చేసికొందురు. వీనికొక విధమగు పరిమెళము గలదు.

(మస్తుకము) చెక్కతుంగ పలు చోట్ల పెరుగు చున్నది. దాని వేళ్ళు లావుగను, గింజలు మూడు పలకలుగ నుండును. దీని వేళ్ళు అడవి పందులు తినును. వీనికిని సువాసన గ