ఈ పుట ఆమోదించబడ్డది
456
కుంభిక నీళ్ళలో మొలచును. వేసవి కాలమందు పుష్పించుట కారంబించును.
తుంగ కుటుంబము.
వూరిగడ్డి ఇసుక నేలలో పెరుగును. దీని అడుగున భూమిలో నున్న దుంపలు ఉల్లి గడ్డల నంటి లశునములు. కాని పైన చార చారలుగ బొరలు గలవు. ఇవి ఉల్లిపాయలో వలెనే ఆకులు మూలమున ఏర్పడినవి. వీనిలోపల తెల్లని పదార్థమున్నది. అది తినుటకు బాగుండును.
- ప్రకాండము
- - నిడువుగానె బెరుగును. దాని అడుగున మాత్రము ఆకులు గలవు. ఇది కొంచెము గుండ్రముగా నుండును.
- ఆకులు
- - విస్తారము లేవు. లఘు పత్రములు. పాద పీఠమునందు గొట్టము వలె నున్నది. సమ రేఖ పత్రము. సమాంచలము. కొన సన్నము.
- పుష్ప మంజరి.
- - గుత్తులు ఆరు ఒదలు పది వరకు కంకులు గలవు. ఈ కంకుల మీద చిన్న చిన్న పుష్పముల వలె నుండునవి పువ్వులు కావు. అవియు కంకులే. వానికి అల్పకణిశములనిపేరు.
పుష్పములలో పుష్పకోశముగాని, దళవలయముగాని లేదు. కింజల్కములు, అండ కోశము మాత్రము గలవు. వానిని గప్పుచు పెరుగు పత్రము చేటికలే. ఈ చేటికలకు తుషములని పేరు. అల్పకణకము మీద మొదట నున్న రెండు తుషములలోనే ఏమియులేదు. పైవానిలో కింజల్కములు అండకోశము గలదు.