పుట:VrukshaSastramu.djvu/425

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

421

ట్టముగా నుండుటచే నీరంతగా లేకున్నను పెరుగ గలవు. ఈ మట్టల మధ్యనుండి ఒకప్పుడు స్థంభమువలె పది అడుగుల ఎత్తు పెరుగు నొక దానిని జూడ నగును. దీని మీద ఆకులు లేవు. కాని, దీని చివర కొమ్మలు రెమ్మలు గలవు. వీని మీద ఆకు పచ్చని మొగ్గలను చూడ వచ్చును. ఈ స్థంభము వంటిది పెద్ద పువ్వుల కాడ. ఆయాకు పచ్చని మొగ్గలు పువ్వుల మొగ్గలు. కిత్త నార మొక్క పూర్తిగ నెదిగిన తరువాత నొకమారు పుష్పించును. పుష్పించి కాయలు గాసిన పిదప నాభారమును మొక్క వహింప జాలక నీరసించి చచ్చి పోవును. ఒక్కొక్కప్పుడా మొగ్గలు పువ్వులు పూయకయే రాలి పోవును. ఇట్లు రాలి పోవు మొగ్గల యందేవియో మార్పులు గలుగుట చేత అవి రాల కున్నను పుష్పింప జాలవు. రాలి భూమి పై బడిన పిదప కొంచెము నీరు తగలగనే గింజలు మొక్కలు మొలచును.

ఈ విధస్ముననే కొన్ని చోట్ల పైరు చేయుట గలదు గాని సాధారణముగ గింజలు పాతి గాని భూమి లోపలనున్న ప్రకాండమును దుంపను ముక్కలుగా కోసి గాని పెంచు చున్నారు.