ఈ పుట ఆమోదించబడ్డది
27
రెమ్మ గెలవలెనే రెమ్మకంకులు, రెమ్మ గుత్తులు గలవు. బంతి, చామంతి, తుమ్మ పువ్వులు నిజముగా ఒక్కొక్క పువ్వు గాదు. మనమొతడి యనుకొనునది పుష్పముల సముదాయమే. బంతి పువ్వులోను చామంతి పువ్వులోను ఒక్కొక్క రేక ఒక్కొక్క పువ్వు. ఇటి పుష్ప సముదాయమునకు బంతి యనిపేరు.
- బొమ్మ
- (మధ్యారంభ మంజరి. వృశ్చికమ మంజరి, శంఖనకమ మంజరి.
కొన్నిటిలో కడ మీది చివ్ర పువ్వులు మొతడ వికసింప నారంభించును. మూడు పువ్వులు కలిసి యుండి నపుడు మధ్య నున్నది మొదట వికసించును. ఈ పద్ధతి గల కాడకు మధ్యారంభ మంజరి అని పేరు. ఈ మధ్యారంభ మంజరిలో ప్రక్కనున్న పువ్వులకు బదులు వృంతములే యున్న యడల దానిని ద్వివృంతమధ్యారంభ మంజరి యందుము.
కొన్ని మధ్యారంభ మంజరులలో పువ్వులు రెండు వైపుల నుండక నొక వైపుననే ల్యుండుటచే కద వంగి నత్తగుల్లమీద చుట్టు లున్నట్లుండును గావున దీనికి శంఖనఖ మధ్యారంభమంజరి యని పేరు. మరికొన్ని మధ్యారంభ మంజరులలో