Jump to content

పుట:VrukshaSastramu.djvu/404

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

400

అరటి కుటుంబము.


అరటిచెట్టు ప్రకాండము భూమిలోపలనే కాని పైన లేదు. మనకు మాను అని అనుకొనునది మిక్కిలి దీర్గముగాను దట్టంగాను నున్న ఆకుల తొడిమ లోక దానినొకటి చుట్టు కొనుటచే ఏర్పడు చున్నది. భూమిలోపల నున్న ప్రకాండము మూలవహము గుల్మము.

ఆకులు
- మిగులపెద్దవి. కణుపు పుచ్చములుండవు. నిడివి చౌకపాకారము. లఘు పత్రము. సమాంచలము సమ రేఖ పత్రము. మర్రి ఆకు మొదలగు వాని యందున్నట్లు వీని యందు అంచు చుట్టు ఈ నేలు లేవు. అందు చేతనే గాలికి చిరిగి పోవును. ఆకులు రెండు వైపుల నున్నగా నుండును.
పుష్పమంజరి. ఒక చెట్టు ఒక మారే పుష్పించును.

పుష్పించుటకే వృంతము పైకి వచ్చును. అదియేజంట. రెమ్మకంకి.

పువులు మిగుల పెద్దవగు చేటికల సందుల రెండు రెండు వరుసలుగా నున్నవి. పుష్పములకు నుప వృంతములు లేవు. క్రింది చేటికల సందు నున్నవి. స్త్రీపుష్పములు. మధ్య చేటికల సందుల నున్నవి. మిధున పుష్పములు పైనున్నవి. పురుష పుష్పములు.

పుష్పనిచోళము. 5 దంతములు గల నొక గొట్టమున్నది. దీని కొక వైపున నిలువున జీలిక గలదు. రక్షకపత్రములు 3 ఆకర్షణ ప్త్రములు 2 గలసి ఈ గొట్టమైనదని యూహింప వచ్చును. ఈగొట్టమునకు లోపలి వైపున విడిగా నొక ఆకర్షణపత్రముగలదు. వానికి రంగంతగాలేదు ఉచ్చము.

కింజల్కములు
- 5 విడిగానున్న ఆకర్షణ పత్రముచే నావరింపబడి యున్నవి. దీని కెదిరుగ నొకకింజల్కమునులేదు. పుప్పొడితిత్తులు వెడల్పుగా నున్నవి.