ఈ పుట ఆమోదించబడ్డది
389
- పుష్పమంజరి.
- - మాను మొదటిభాగము మీద మిక్కిలి చిన్న కొమ్మల నంటి కంకులు పుట్టుచున్నవి. ఏక లింగ పుష్పములు. మగ పువ్వుల కంకి మిక్కిలిచిన్నది.
- మగ కంకి.
- పుష్పనిచోళము
- రెండు రేకులు మాత్రమె యున్నవి. మంచి రంగు గాని వాసన గాని లేదు.
- కింజల్కములు
- -. ఒకటియే కాడస్ లావుగ నున్నది. పుప్పొడి తిత్తి రెండు గదులు గలది.
- ఆడుకంకి
- - మగ కంకి కంటె గుండ్రముగా నున్నది.
- పుష్ప నిచోళస్ము
- సంహ్యుక్తము. గొట్టమువలె నున్నది. గొట్టము మూతి సన్నముగా నున్నది.
- అండకోశము
- - అండాశయము ఒక గది. ఒక అండము గలదు. కీలము ప్రక్కగాను కొంచెము పొడుగుగాను నున్నది. కీలాగ్రము లావు.
పండు ఒక పుష్పము వల్లనే ఏర్పడుట లేదు. కంకి మీద నున్న పుష్పములన్నియు గలిసి ఒక పండు అగుచున్నవి. ఒక్కొక్క పుష్పము తొనల ప్రక్కనుండెడు పీచును పుష్పములే గాని అవి గొడ్డులై యున్నవి. లేత కాయలను గోసిన పాలు వచ్చును.
- మఱ్ఱి చెట్టు
మఱ్ఱిచెట్టు మనదేశములో పలుతావులందు పెరుగుచున్నది. దీనికి ఊడలు గిలది విశాలముగ వ్యాపించును. దీనికొమ్మలలోను పాలుగలవు.