Jump to content

పుట:VrukshaSastramu.djvu/379

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

375

వ్వులకుగాని చెట్తు బెరడునకుగాని సువాసన లేదు. మాను మధ్యనున్న దారువునకే గలదు. ఈ చందనములో శ్రీ చందనము, పీత చందనము, రక్త చందనము మొదలగు భేదములు వున్నవని అను చున్నారు. మొదటి రెండును ఈ చెట్టు యొక్క మంచి రకము. చెడ్డరకములే గాని రక్త చందనము దీనిది గాదు. ఈ రక్త చందనము తోడనే చందనపు బొమ్మలు చేయుదురు. ఈ చెట్టు చిక్కుడు కుటుంబము లోనిది. మంచి గంధపు చెట్లు ఎక్కువగా దక్షిణ దేశము నందుండినను చమురు దీయుట లేదు. మంచి గంధపు నూనె, అయోద్య వద్దను, హిందూస్థానమందలి వరి కొన్ని పట్టణములలోను చేయుచున్నారు. మంచి గంధపు చెక్కను పొడి గొట్టి రెండు దినముల నీళ్ళలో నాననిచ్చి బట్టి పట్టుదురు. నూనెయు నీళ్ళతో గలిసి ఆవిరియై రెండును జల్లారి నీళ్ళమీద నూనెదేలుచుండును. తరువాత దీనిని వేరు వేరు విధముల పరి శుభ్రము చేసెదరు. ఒక్కొక్కప్పుడు మడ్డి అంతయు బోవుటకు నొక సంవత్సరము వరకు నానూనెను అట్లే యుంచెదరు.

మంచి గంధము ఔషదములలో గూడవాడుదురు. ఇది ముఖ్యముగా పరిమళ ద్రవ్యములలో ఒకటి. బొట్టు పెట్టుకొనుటకు దీనినుపయోగింతుము. గౌరవము చూచించుటకై