ఈ పుట ఆమోదించబడ్డది
369 ము వలచివైచి ఎండబెట్టి అంగళ్ళయందు అమ్ముచున్నారు. దీనినే రేవల్చిన్ని యందుము. దీనిని ఔషదములలో వాడుదురు. రేవల్చిన్ని మనకు చీనా, టిబెట్టు, దేశముల నుండియు లండను పట్టణము నుండియు కూడ వచ్చు చున్నది. మన దేపు పదార్థము కంటె బొరుగూరి పదార్థము మంచిదను చున్నారు. అట్లే యైనను మన మొక్కలను శ్రద్ధతో బెంచు నెడల అన్య దేశపు పదార్థమున కంటే తక్కువ రకముగాదని యూహించుటకవకాశమున్నది.
మిరియపు కుటుంబము.
మిరియపుతీగె మలబారు దేఅమునందెక్కువగా పైరగు చున్నది. ఇది అగంతుక వేరుల మూలమున ప్రాకును.
- ఆకులు
- - ఒంటరి చేరిక తీగెకు రెండు వైపులనే యుండును. హృదయాకారము, కొంచెము వంకరగా నుండును. అయిదారు ఈనెలుండును. కొనవాలముగలదు. రెండు వైపుల నున్నగ నుండును.
- పుష్పమంజరి
- - కంకి, ఏకలింగపుష్పములు; కొన్ని అడకంకులో కొన్ని పుష్పములును గలవు ఆడుతీగెలు పోతుతీగెలు వేరువేరుగా కూడ కలవు.
- పుష్ప కోశము
- - లేదు
- దళ వలయము
- - లేదు