పుట:VrukshaSastramu.djvu/310

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

306

ష్పములు వృశ్చికమధ్యారంభ మంజరులుగా నున్నవి. పుష్ప కోశము, దళ వలయముల త్మ్మెలు, కింజల్కములు సాధారణముగ నైదేసి యుండును. అండాశయము ఉచ్చము. నాలుగు అండము లుండును. అండాశయమునకు నాలుగు తమ్మెలున్నవి. వీని మధ్య నుండి కీలము వచ్చు చున్నది. కీలాగ్రములు రెండు. కాయ విచ్చెడు కాయ.

నక్కెరి చెట్టు పండ్రెండడుగులు పెరుగును. ఆకులు అండాకారము. పువ్వులు తెల్లగాను చిన్నవిగాను వుండును. దీని కాయలను మందులలో ఉపయోగించురు. కలప పొయ్యిలోనికి బంకను తుమ్మ జిగురు వలెను ఉపయోగింతురు.

పెనుజెఱ్ఱి చెట్టు చిన్న చెట్టు. ఇది తెల్లని పువ్వులను పూయును. వీనిలో చాల భాగము మగ పువ్వులే.

పెద్ద బట్టవ చెట్టు. చిన్నది. ఆకులు హృద్యాకారముగ గరుకుగను వుండును. దీని కలప బాగుగనే వుండును.

బాపన బూరి గుబురు చెట్టు. ఆకులు చాల బిరుసుగా నుండును. వర్ష కాలమందు తెల్లని పువ్వులు పూయును.