293
యోగించు చున్నారు. దీనికొమ్మలనుండి పచ్చనిపాలు వచ్చును. ఈపాలనుండి పచ్చని రంగు నొక దానిని చేయ వచ్చును.
అంకుడు చెట్టు మన దేశ మందంటటను పెరుగు చున్నది. ఇదియు పాల చెట్టు వలెనే యుండును. దీని బెరడును గింజలను చిరకాలము నుండి జిగట విరేచనములకు మందుగా వుపయోగించు చున్నారు. కాని, పాల చెట్టు నిదియు నొక రీతి నుండుటచె కొందరు పాల చెట్టు బెరుడు నుపయోగించి అంకుడు బెరుడు మంచిది కాదను వచ్చిరి. కాని వాని రెండింటిని సులభముగానే గుర్తింప వచ్చును. పాల చెట్టు బెరడు, అంకుడు బెరుడు కంటె నల్లగా నుండును. అంకుడు కలపయు మృదువుగా వుండును గాన దీని తోడను, దువ్వెనలు, బొమ్మలు మొదలగునవి చేయ వచ్చును.
వాక్కాయ చెట్టు మిక్కిలి గుబురుగా బెరుగు చున్నది. దీని కొమ్మలు భూమి వద్ద నుండియు వ్వాపించు చున్నవి. వీనికి పెద్ద ముండ్లు గలవు. ఆకు లొక్కొకచో రెండేసి యుండును. గాని, జత విడస్చి జత పెద్దదిగా నుండును. వాక్కాయలతో పచ్చడి మాత్రము చేసి కొను చున్నాము. కాని వీనిని తరుచుగా దినిన యెడల దేహ దార్డ్యము ధృడ మైనదిగానిచో జబ్బు చేయును.