Jump to content

పుట:VrukshaSastramu.djvu/295

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

291

పుష్ప కోశము
- సంయుక్తము గుండ్రని 5 తమ్మెలు. నీచము:
దళ వలయము
- సంయుక్తము. పొట్టిగొట్టము గలదు. పైన నిడుపాటి 5 తమ్మెలున్నవి.
కింజల్కములు
- అయిదు. కాడలు పొట్టివి. గొట్టము యొక్క కంఠమునంటి యున్నవి. పుప్పొడి తిత్తులైదు గలసి కీలమును టోపి వలె గప్పు చున్నవి. వీని అడుగున రోమములు గలవు.
అండ కోశము
- అండాశయము ఉచ్చము. 2 గదులు. మొదాట చివర గలసి యున్నవి కాని మధ్య విడిగానే యున్నవి. కీలము ఒకటి కీలాగ్రము గుండ్రము.

ఈ కుటుంబపు మొక్కలు విస్తారము ఉష్ణ దేశపు టడవులలో పెరుగు చున్నవి. వీనిలో తీగెలు చాలగలవు. కొమ్మలందు పాలున్నవి. ఆకులు లఘు పత్రములు. సమాంచలము. సాధారణముగ అభిముఖ చేరిక. దళ వలయము సంయుక్తము. తమ్మెలు మొగ్గలో మెలి వెట్టి నట్లుండును. కింజల్కముల కాడలు మిక్కిలి పొట్టివి. తరచుగా వుండవు. అండ కోశము ఉచ్చము. రెండు గదులు విడిగా నైనను కలసి యైనను వుండును. పుప్పొడి తిత్తులు కీలాగ్రము నంటి యున్నవో లేవో అండాశయము దగులు రెండును విడిగా నున్నవో కలిసి యున్నవో అను ఇట్టి అంశములను బట్టి ఈ కుటుంబమును జాతులుగను, తెగలుగను విభజించి యున్నారు.