పుట:VrukshaSastramu.djvu/293

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

289

కొన్నిటిలో మూడేసి మాత్రమే గలవు. కొన్నిలఘు పత్రములే.

మాలతీ తీగెయు ఎగ ప్రాకును. ఆకులు పక్ష వైఖరి. చిట్టి ఆకులు మూడు జతలైనను, అయిదు జతలైనను వుండును.

పారుజాతము చిన్న చెట్టు. సదాపుష్పించు చుండును. పువ్వులు తెల్లగాను సువాసనగను నుండును. దళ వలయము యొక్క గొట్టము తిరుచూర్ణము రంగుగా నుండును.

సన్నజాజి తీగెకు నులి తీగె లుండవు. దీని పువ్వులు తెల్లగను సువాసనగను నుండును.


గన్నేరు కుటుంబము.


గన్నేరు తోటలందు గుబురుగా పెరుగు మొక్క.

ఆకులు
- కిరణప్రసారము. కణుపువద్ద మూడేసి కలవు. సన్నము గాను, బల్లెపాకారముగను దట్టముగను వున్నవి. రెండు వైపుల నున్నగా నుండును. కొనసన్నము. సమాంచలము. విషమరేఖ పత్రము. మధ్య ఈనె పెద్దదిగా నున్నది.
పుష్ప మంజరి
- కొమ్మల చివర నుండి మధ్యారంభ మంజరులగు రెమ్మ గెలలు. చేటికలు గలవు. పువ్వులు సరాళము గులాబిరంగు.,